ఆ హీరోతో నటిస్తే... హీరోయిన్లు అంతే!
సినీ పరిశ్రమ అన్నతర్వాత అనేక సెంటిమెంట్లు ఉంటాయి. సోషల్ మీడియా అకౌంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత హీరోల అభిమానులు కూడా రకరకాల సెంటిమెంట్స్ ను సృష్టిస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ధనుష్ సినిమాలో ఏ హీరోయిన్ నటించినా ఆ తర్వాత ఆ ముద్దుగుమ్మ కెరీర్ కష్టమని, అయిపోతోందంటూ సరికొత్త ప్రచారం నడుస్తోంది.
ధనుష్ సరసన నటించిన హీరోయిన్ల అందరి విషయంలో ఇదే జరిగింది చూడండంటూ అభిమానులు ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. గతంలో అతను నటించిన రఘువరణ్ బీటెక్ సినిమా భారీ హిట్ అయింది. అందులో అమలాపాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత అమలాపాల్ కెరీర్ క్రమేపీ తగ్గుతూ వచ్చింది. అకస్మాత్తుగా అలా ఎందుకు జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. అమలాపాల్ తోపాటు ఆ జాబితాలో సాయిపల్లవి, నిత్యామీనన్, సంయుక్త మీనన్ లాంటివారు కూడా ఉన్నారు. అందరూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.

సాయిపల్లవి కొన్నాళ్లు పరిశ్రమకే దూరమైంది. ఇప్పుడిప్పుడే మళ్లీ స్థిరపడటానికి ప్రయత్నాలు చేస్తోంది. సంయుక్త మీనన్ అయితే పరిశ్రమకు దూరంగా వెళ్లిపోయింది. ఈ ఉదాహరణలు చూపుతుండటంతో ఈ వార్త ఎంతో వైరల్ గా మారింది. ధనుష్ సినిమాలో ఏ హీరోయిన్ నటించినా ఆ సినిమా తర్వాత కెరీర్ క్లోజ్ అవుతుందంటున్నారు. ఎంత పెద్ద క్రేజ్ ఉన్నప్పటికీ హీరోయిన్ కెరీర్ ముందకు సాగదంటూ ట్రోలింగ్ జరుగుతోంది.
తమిళ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత కస్తూరి రాజా కుమారుడు ధనుష్. సోదరుడైన సెల్వరాఘవన్ ఒత్తిడితో ధనుష్ నటనలోకి అడుగుపెట్టడం జరిగింది. రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యను 2004లో ప్రేమించి పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. 2022 జనవరి 17న ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications