"ఉస్తాద్ భగత్ సింగ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్‌లో వాహనదారులకు పోలీసుల అలర్ట్ !

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌'గా ప్రేక్షకుల్ని పలకరించేందుకు రెడీ అయ్యారు. ఈ ఏడాది వరుసగా రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్.. "హరిహర వీరమల్లు" చిత్రంతో నిరాశపరిస్తే.. "ఓజీ" మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఈ మూవీతో ఆడియన్స్ ని అలరించేందుకు సిద్ధమయ్యారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. మార్చి 26న విడుదల చేయనున్నారు. అయితే ఇప్పుడు అన్ని పనులు పూర్తి కావడంతో వారం ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు. మార్చి 19న గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. దీంతో మరోసారి వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుండడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అలాగే గబ్బర్ సింగ్, బీమ్లా నాయక్ తర్వాత మరోసారి ఈ చిత్రంలోపోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనుండడం మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.

hyderabad-police-alert-to-motorists-due-to-pawan-kalyan-ustad-bhagat-singh-movie-pre-release-event

కాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మార్చి 15వ తేది, ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు. యూసఫ్‌గూడలోని పోలీస్ గ్రౌండ్స్ (1st బెటాలియన్) వేదికగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పవర్ స్టార్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున వాహనదారులకు కీలక అలర్ట్ జారీ చేశారు. కేవీబీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, సామాన్య ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుని పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ట్రాఫిక్ మళ్లింపు..

  • జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు నుంచి కేవీబీఆర్ (కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి) స్టేడియం వైపు వెళ్లే వాహనాలను కృష్ణానగర్ జంక్షన్ వద్ద శ్రీనగర్ కాలనీ - పంజాగుట్ట వైపు మళ్లించనున్నారు.
  • మైత్రీవనం జంక్షన్ నుండి జూబ్లీహిల్స్, మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను యూసఫ్‌గూడ బస్తీ వద్ద ఆర్బీఐ క్వార్టర్స్ - కృష్ణానగర్ జంక్షన్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు మళ్లించనున్నారు.
  • మైత్రీవనం నుండి బోరబండ బస్టాప్ వైపు వెళ్తే వాహనాలు సవేరా ఫంక్షన్ హాల్ - కృష్ణకాంత్ పార్క్ - జీటీఎస్ టెంపుల్ - కళ్యాణ్ నగర్ - మోతీ నగర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
  • బోరబండ నుండి మైత్రీవనం వెళ్లే ప్రయాణికులు ప్రైమ్ గార్డెన్ - మిడ్‌ల్యాండ్ బేకరీ - జీటీఎస్ కాలనీ - కళ్యాణ్ నగర్ జంక్షన్ - ఉమేష్ చంద్ర స్టాచ్యూ మీదుగా మైత్రీవనం వెళ్లాలని తెలిపారు.

పార్కింగ్ స్థలాలు..

ఇక ఈ ఈవెంట్‌కు వచ్చే ప్రజల కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు.

  • జానకమ్మ తోట పార్కింగ్, యూసఫ్‌గూడ (ద్విచక్ర మరియు నాలుగు చక్రాల వాహనాలు)
  • మెట్రో పార్కింగ్, యూసఫ్‌గూడ (ద్విచక్ర మరియు నాలుగు చక్రాల వాహనాలు)
  • సవేరా ఫంక్షన్ హాల్ (కేవలం నాలుగు చక్రాల వాహనాల కోసం)
  • మహమూద్ ఫంక్షన్ హాల్ (కేవలం నాలుగు చక్రాల వాహనాల కోసం)
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+