పవన్‌కళ్యాణ్‌కు రూ.3లక్షలు విరాళం అందజేసిన హైపర్ ఆది..
ఏపీలోని వరద భాదితులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది తనవంతు సాయం అందించారు. జబర్దస్త్ షో తో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు హైపర్ ఆది. తన కామెడి, పంచ్‌లతో తెలుగు ప్రేక్షకులనుంచి ఆధరాభిమానాలు పొందారు. ఇటీవలే రాష్ట్రంలో కురిసిన భారీవర్షాలకు, విజయవాడలోని కొన్ని ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే వరద బాధిలకు అండగా, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చాలామంది విరాళాలు అందజేసారు. తాజాగా జబర్ధస్త్ నటుడు హైపర్ ఆది కూడా తన వంతుగా ఆర్థిక సాయం అందించారు.
ఈ నేపథ్యంలో హైపర్ ఆది ఏపీలోని వరద బాధితులకు విరాళంగా రూ. 3లక్షల రూపాయలు అందించించారు. అందుకు సంబంధించిన చెక్‌ను స్వయంగా ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కు అందజేసారు. ఈ డబ్బును ఇటీవలే కురిసిన వర్షాలకు నష్టపోయిన పంచాయితీలకు అందజేయాలని ఆది కోరారు. ఈ మూడు లక్షల రూపాయల్లో పిఠాపురం నియోజకవర్గంలోని వరదల పీడిత గ్రామమైన ఎ.కె మల్లవరానికి లక్ష రూపాయలు ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.

మిగిలిన రూ. 2లక్షలు తన సొంత గ్రామమైన పల్లాపల్లి గ్రామ పంచాయతీ కోసం అందజేయమన్నారు. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడారు. ఇటీవల కురిసిన వరదల్లో నష్టపోయిన వారికి ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ రూ.6 కోట్లు విరాళం ఇచ్చి ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని పెంపొందించారు. ఆ స్ఫూర్తితోనే నేరుగా పంచాయితీలకు విరాళం ఇవ్వవచ్చని తెలిసి తన వంతుగా రూ.3 లక్షలు ఇచ్చానని జబర్థస్త్ నటుడు హైపర్ ఆది చెప్పారు.












Click it and Unblock the Notifications