అనుకోకుండానే నటిని అయ్యాను.. ఆ సినిమానే నా డెస్టినీ మార్చేసింది!

ప్రముఖ నటి రాశీ ఖన్నా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితుల గురించి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 2013లో 'మద్రాస్ కేఫ్'తో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో పెరిగి, ముంబైలో కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడిన రాశీ ఖన్నా తనను తాను ఓ పాన్ ఇండియా వ్యక్తిగా భావిస్తారు. విభిన్న భాషల్లో నటిస్తూ ఆయా ప్రాంతాల సంస్కృతులకు తాను అలవాటు పడిపోయానని ఆమె వెల్లడించారు.

మూడు నగరాలు.. మూడు అనుభవాలు
ఢిల్లీ: ఢిల్లీ అంటే తనకు ఇష్టమైన తిండి గుర్తుకు వస్తుందని ఆమె చెప్పారు. ముఖ్యంగా పశ్చిమ ఢిల్లీలోని జ్వాలా హేరీ మార్కెట్‌లో తినే గోల్గప్పలు, టిక్కీలను తాను ఎంతో మిస్ అవుతున్నానని, తన తల్లి ఇంట్లోనే ఢిల్లీ స్టైల్ చోలే భటురే చేసి పెడుతుంటారని తెలిపారు.

ముంబై: ముంబైలో తనకు నచ్చేది అక్కడి భద్రత. అర్థరాత్రి 12 గంటలకైనా ఆటోలో నిర్భయంగా తిరగొచ్చని, ఇప్పటికీ అప్పుడప్పుడు తాను ఆటోల్లో ప్రయాణిస్తానని చెప్పారు. ముంబైలో ఎవరి పని వారు చూసుకుంటారని ఆమె మెచ్చుకున్నారు.

హైదరాబాద్: ప్రస్తుతం హైదరాబాద్ తన ఇల్లుగా మారిపోయిందని రాశీ పేర్కొన్నారు.

I Became an Actress by Chance That Film Changed My Destiny Says Raashii Khanna

అనుకోకుండా సినిమాల్లోకి..
సినిమాల్లోకి రాకముందు తనకు నటనపై పెద్దగా ఆసక్తి లేదని రాశీ ఖన్నా వెల్లడించారు. "నేను సినిమాలు చూస్తూ పెరగలేదు. 'మద్రాస్ కేఫ్' తర్వాత మంచి సినిమాలు రాకపోతే వేరే ఏదైనా పని చేసుకుందాం అనుకున్నాను. కానీ తెలుగులో మొదటి సినిమా (ఊహలు గుసగుసలాడే)తో లభించిన గుర్తింపు నన్ను ఇక్కడే ఉంచేసింది. అంతా నా డెస్టినీ" అని ఆమె వివరించారు.

వారసత్వం లేదు.. కేవలం కష్టాన్నే నమ్ముకున్నాను
చిత్ర పరిశ్రమలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా రావడం గురించి మాట్లాడుతూ.. "పరిశ్రమలో ఉన్న వారికి అవకాశాలు త్వరగా రావచ్చు కానీ, ప్రతిభ ఉంటేనే నిలదొక్కుకుంటారు. బయటి నుండి వచ్చిన వారు కొంచెం ఎక్కువ కష్టపడాలి. నేను రిజెక్షన్లను చూసి ఎప్పుడూ విక్టిమ్‌లా ఫీలవ్వలేదు. మన తలరాతలో ఉన్నది ఎవరూ తీసుకోలేరు" అని ధీమా వ్యక్తం చేశారు.

పరిశ్రమలో లింగ వివక్షపై స్పందన
చిత్ర పరిశ్రమలో హీరోలకు ఇచ్చే ప్రాధాన్యత గురించి రాశీ మాట్లాడుతూ.. "మన సమాజం పురుషాధిక్యత కలిగినది. ఇండస్ట్రీలో ఇప్పటికీ 'హీరో వర్షిప్' (హీరోను పూజించడం) ఉంది. అందుకే సెట్స్‌లో ట్రీట్‌మెంట్‌ విషయంలో హీరో, హీరోయిన్ల మధ్య తేడా ఉంటుంది. ఎవరికి బాక్సాఫీస్ వద్ద ఎక్కువ డిమాండ్ ఉంటే వారికే ఎక్కువ గౌరవం దక్కుతుందని నిర్మాతలు భావిస్తారు. అయితే, ఇప్పుడు అమ్మాయిలు తమ గొంతు విప్పుతున్నారు, పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి" అని రాశీ ఖన్నా అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+