కెజీఎఫ్ క‌థే నాకు నచ్చలేదు.. నటి అర్చన..

కెజిఎఫ్ సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో మ‌న అంద‌రికి తెలుసు. అన్ని భాష‌ల్లో విడుద‌లై సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది ఈ సినిమా. ఈ సినిమాలో హీరోగా న‌టించిన యష్ ని ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గానో అభిమానించారు. ఈ సినిమాలో య‌ష్ పాత్ర ఎంత కీల‌క‌మో, య‌ష్ త‌ల్లి పాత్ర కూడా అంతే కీల‌కం. త‌ల్లి పాత్ర ఎంతో ఎమోష‌న‌ల్‌గా, ప్రేక్ష‌కుల‌ను సైతం కంట‌త‌డి పెట్టేంచేలా ఉంది. అందులో త‌ల్లి పాత్రలో న‌టించిన హీరోయిన్ అర్చ‌న జోయిస్.

ఆ న‌టి తాజాగా కెజిఎఫ్ సినిమా గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. కెజిఎఫ్‌ చిత్రంలో నటించే అవకాశం వచ్చినప్పుడు తనకి ఏమాత్రం ఆసక్తి లేదని అర్చన తాజాగా వ్యాఖ్యలు చేసింది. త‌న‌కు కెజిఎఫ్ సినిమా కథ కూడా నాకు నచ్చలేదని, ఆ క‌థ అంత ఆసక్తిగా కూడా అనిపించలేదని, అయినా సినిమాకు ఓకె చెప్పాను. కానీ మనస్ఫూర్తిగా నా లోపల ఒప్పుకోలేదు. కానీ సినిమా రిలీజ్ తర్వాత త‌న‌కు ఊహించని విధంగా పాపులారిటీ లభించిందని కెజిఎఫ్ న‌టి అర్చన జోయిస్ పేర్కొన్నారు.

 I didnt like the story of KGF.. Actress Archana..

రాఖీ భాయ్ పాత్ర‌లో య‌ష్‌: ఇండియా మొత్తం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది కెజిఎఫ్ సినిమా. ఈ సినిమాలో హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ఈ సినిమా పాన్ ఇండియా గుర్తింపు తీసుకువచ్చింది. ఈ సినిమాలో రాఖీ భాయ్ పాత్ర‌లో య‌ష్ ఎంతో బాగా ఆక‌ట్ట‌కున్నారు. అయితే రాఖీ భాయ్ తల్లి పాత్రలో నటించిన అర్చన జోయిస్ కూడా ఎంతో బాగా న‌టించారు. ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో ప్రేక్ష‌కుల‌ను హృద‌యాల‌ను గెలుచుకున్నారు.

కన్నీళ్ళు పెట్టించేలా నటిస్తూనే పవర్ ఫుల్ డైలాగ్స్‌తో క‌ట్టిప‌డేసారు. ఆ సినిమాలో తల్లి చెప్పిన మాటల వల్లే రాఖీ భాయ్ కెజిఎఫ్ సామ్రాజ్యాన్ని ఏల‌డం జ‌రుగుతుంది. ఈ సినిమాలో న‌టి అర్చ‌నా నిరుపేద త‌ల్లి పాత్ర‌లో క‌నిపిస్తారు. ఆమె న‌ట‌న‌కి అంద‌రూ ఫిదా అవ్వ‌డ‌మే కాకుండా ఎంతో ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్అయ్యారు కూడా.

 I didnt like the story of KGF.. Actress Archana..

మనస్ఫూర్తిగా ఈ సినిమాకు ఒప్పుకోలేదు: అయితే ఈ సినిమా గురించి అర్చ‌న తాజాగా స్పందించారు. ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినప్పుడు తనకి ఏమాత్రం ఆసక్తి లేదని అర్చన తాజాగా వ్యాఖ్యలు చేసింది. పైగా తల్లి పాత్రలో నటించాలని చెప్పారు. దీనితో ససేమిరా అన్నట్లు అర్చన జోయిస్ పేర్కొన్నారు. ఎందుకంటే అప్పటికి అర్చ‌నా వయసు 21, 22 మాత్రమే. ఈ చిత్రంలో మీరు తల్లిగా నటించాలి అని చెప్పారు. నేను వెంటనే షాక్ గుర‌య్యాను. అస‌లు నా వయసు మీకు తెలుసా! అని వారిని అడిగాను.

అయినా వారు ప‌ట్టించుకోలేదు. నేను నో చెబుతున్నా వాళ్ళు వదిలిపెట్టలేదు. నన్ను అడుగుతూనే ఉన్నారు. నా స్నేహితుల ద్వారా ఒప్పించే ప్రయత్నం కూడా చేశారు. ముందు కథ విను అని నా స్నేహితులు అన్నారు. అయితే, సరే ఒకసారి కథ విందాం అని కూర్చున్నా.. అయితే, ఆ కథ కూడా నాకు నచ్చలేదు.. కెజిఎఫ్ క‌థ‌ అంత ఆసక్తిగా కూడా అనిపించలేదు. కెజిఎఫ్ సినిమాకు ఓకె అయితే చెప్పాను కానీ నేను మనస్ఫూర్తిగా అయితే ఒప్పుకోలేదు.

కానీ సినిమా రిలీజ్ తర్వాత ఊహించ‌ని విధంగా పాపులారిటి ల‌భిచింది అర్చన జోయిస్ పేర్కొన్నారు. అర్చన జోయిస్ నటించిన తాజా చిత్రం మాన్షన్ 24. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో న‌టించారు. య‌ష్ త‌ల్లి అర్చ‌నా ఇందులో కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 17న డైరెక్ట్ గా ఓటిటి హాట్ స్టార్ లో రిలీజై స్ట్రీమింగ్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+