మల్లన్న దర్శనానికి ఇక రైలులో - రేపే ప్రారంభం, ప్రత్యేకతలు..!!
మల్లన్న భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. ఇక నుంచి రైలులో కొమురవెల్లి వెల్లేందుకు వీలుగా రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి సమీపంలో కొత్తగా నిర్మించిన రైల్వేస్టేషన్‌ను ఈ నెల 26న(ఆదివారం) ప్రారంభించనున్నారు. రూ. 6 కోట్ల వ్యయంతో రైల్వేస్టేషన్‌ను నిర్మించిన ఈ స్టేషన్ లో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న క్తుల సౌకర్యార్థం నిర్మించిన రైల్వే స్టేషన్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. రేపు (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు రైల్వే స్టేషన్ ప్రారంభం కానుంది. కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే భక్తుల సౌకర్యార్థం, మనోహ రాబాద్-సిద్దిపేట కొత్త రైల్వే మార్గంలో మనోహరాబాద్-కొత్తపల్లి రైలు మార్గం ప్రాజెక్టులో భాగంగా ఈ నూతన రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. సుమారు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేషన్‌లో హై లెవెల్ ప్లాట్‌ఫారమ్, ప్లాట్‌ఫారమ్ షెల్టర్, ప్రయాణికుల వేచి ఉండే గది, తాగునీటి సౌకర్యం, విద్యుత్ దీపాలు, ఇతర ప్రాథమిక వసతు లను కల్పించారు. భక్తులు, ప్రయాణికు లు సౌకర్యవంతంగా ప్రయాణించేలా ఆధు నిక ప్రమాణాలతో స్టేషన్‌ను నిర్మించారు.

భక్తులకు ప్రయోజనకరంగా
ప్రస్తుతం సికింద్రాబా ద్-సిద్దిపేట మధ్య నాలుగు డెమూ రైళ్లు నడుస్తుండగా, వాటికి కొమురవెల్లి పుణ్యక్షేత్రం స్టేషన్‌లో అదనపు స్టాపేజీ కల్పించారు. ప్రారంభోత్సవం సందర్భంగా సిద్దిపేట- సికింద్రాబాద్ డెమూ రైలు నంబర్ 77654 ను కొమురవెల్లి పుణ్యక్షేత్రం స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇక్కడ నుంచి వెళ్లే రైళ్లను హైదరాబాద్ తో అనుసంధానం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లేందుకు అధికారులు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. దీని ద్వారా ఇప్పటి వరకు మల్లన్న దర్శనం కోసం బస్సులో మాత్రమే వెళ్లే భక్తులకు ఇక నుంచి రైలు అందుబాటులోకి రానుంది.












Click it and Unblock the Notifications