ఆ హీరో సినిమా నుంచి నన్ను దారుణంగా తీసేశారు : మెగా డాటర్ నిహారిక
మెగా డాటర్ నిహారిక ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నిహారిక, ఇటీవల కాలంలో బిజీగా మారారు. చైతన్య జొన్నలగడ్డతో నిహారిక పెళ్లి ,విడాకులు సంగతి తెలిసిన విషయమే. విడాకుల తర్వాత నిహారిక ఫుల్ యాక్టివ్‌గా మారారు. వరుస సినిమాలు, షోలతో ఫుల్ బిజీగా మారారామె. ఇదిలా ఉంటే నిహారిక చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. చిరంజీవి పెదనాన్నతో నటించిన 'అంజి' సినిమా నుంచి తనను తొలగించారని నిహారిక చెప్పుకొచ్చారు. సినిమాలో ఉండే చిన్న పిల్లల్లో తాను కూడా ఒకర్నినని ,నాలుగు రోజులు షూటింగ్ చేసిన తర్వాత తనని ఆ సినిమా నుంచి తొలగించారని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమా నుంచి తనని ఎందుకు తీసేశారో ఇప్పటికి అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు.
ఇక నిహారిక నిర్మాతగా మారి ఓ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర్ బ్యానర్‌పై ''కమిటీ కుర్రాళ్లు'' పేరుతో ఓ సినిమాను తెరకెక్కించారు నిహారిక. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. హీరో సిద్దు జొన్నలగడ్డతో పాటు, మెగా హీరోలు సైతం ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశారు. ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. గ్రామంలోని 11 మంది కుర్రాళ్లకు ,సర్పంచ్‌కు మధ్య జరిగే కథగా ''కమిటీ కుర్రాళ్లు'' తెరెక్కించాడు దర్శకుడు. గ్రామీణ రాజకీయం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భతంగా ఉందని సినీ పండితులు చెబుతున్నారు.

మెగా హీరోలు సైతం ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేశారు. గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అందరు కొత్త వాళ్లతో తెరకెక్కించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. మరోవైపు ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం రియాక్ట్ అయ్యారు. కమిటీ కుర్రోళ్ళు' గురించి గ్రేట్ థింగ్స్ వింటున్నా. నీ డెబ్యూ ప్రొడక్షన్ సక్సెస్ పై కంగ్రాట్స్ నిహారిక. టోటల్ టీంకు కూడా శుభాకాంక్షలు. త్వరలో సినిమా చూస్తానంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. తాను నిర్మించిన తొలి సినిమా హిట్ కావడంతో నిహారిక సైతం ఆనందం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications