అల్లు అర్జున్ లైనప్ లో 4 స్టార్ డైరెక్టర్లు!
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. పుష్ప చిత్రం దేశవ్యాప్తంగా ఘనవిజయం సాధించడంతో పుష్ప2పై అంచనాలు భారీగా ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024 ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతోంది. అంత సమయం పడుతుందా? అంటూ బన్నీ అభిమానులు కాస్తంత నిరాశను కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే సినిమా బాగా రావాలంటే ఆమాత్రం తప్పనిసరి అని బన్నీ టీం చెబుతోంది.
పుష్ప2 తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేయబోతున్నాడు? అనేది ఆసక్తికరంగా మారింది. హ్యాట్రిక్ హిట్లు కొట్టిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని తర్వాత యానిమల్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలకంటే ముందుగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనే నిర్ణయానికి బన్నీ వచ్చినట్లు తెలుస్తోంది.

అట్లీ ఇప్పటికే బన్నీని నాలుగైదుసార్లు కలిసి కథను కూడా వినిపించారు. జవాన్ ఫలితం తర్వాత నిర్ణయం తీసుకుందామని అల్లు అర్జున్ భావించాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అట్లీకి పచ్చజెండా ఊపాడు. త్రివిక్రమ్ తర్వాతకానీ, ముందుకానీ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయాలనుకున్నప్పటికీ స్కంద చిత్రం నిరాశ పరచడంతో బోయపాటితో సినిమా చేయాలా? వద్దా? అనే డోలాయమానంలో బన్నీ ఉన్నాడు.
అయితే లైనప్ స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకుంటున్నాడు. ముందుగా అట్లీ, ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చిత్రాలు రాబోతున్నాయి. జైలర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా బన్నీకి ఒక కథ వినిపించాడు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సందీప్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే చిత్రానికి ముందుకానీ, లేదంటే ఆ తర్వాతకానీ నెల్సన్ తో చిత్రం చేసే అవకాశం ఉంది. ఏదైమనప్పటికీ స్టార్ డైరెక్టర్లను అల్లు అర్జున్ మంచి లైనప్ లో ఉంచాడు అంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications