అప్పుడు సంతూర్ మమ్మీ.. ఇప్పుడు నేషనల్ క్రష్.. ఎవరా బ్యూటీ ?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క ఫ్రైడే చాలు సార్.. కెరీర్ మారిపోవడానికి అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ విషయం అక్షరాల నిజం అని ఒప్పుకోవాల్సిందే. ఒక్క హిట్ తో స్టార్లుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. అయితే ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. అదృష్టం కూడా కలిసొచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అయితే ఆమె కెరీర్ లో సైతం ఎన్నో కష్టాలను దాటుకుంటూ వచ్చారని తెలిసి సర్వత్రా ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆ బ్యూటీ.. ఒకప్పుడు సంతూర్ మమ్మీగా గుర్తింపు పొంది.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటుండడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ? ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..
ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ " త్రిప్తి డిమ్రి ". సందీప్ రెడ్డి తెరకెక్కించిన 'యానిమల్' సినిమాతో త్రిప్తి డిమ్రి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినప్పటికి.. ఈ ఒక్క చిత్రంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. 'యానిమల్' సీక్వెల్ గా రూపొందనున్న 'యానిమల్ పార్క్' మూవీలోనూ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా కంటిన్యూ అవ్వనుంది. అంతే కాకుండా రీసెంట్ గానే సందీప్ - ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న "స్పిరిట్" చిత్రంలో కూడా నటించే ఛాన్స్ దక్కించుకుంది.

కుటుంబ నేపథ్యం..
త్రిప్తి డిమ్రికి నటనపై ఆసక్తి పెరగడానికి కారణం ఆమె తండ్రి దినేష్ డిమ్రి అని చెప్పొచ్చు. ఆయన రామ్‌లీలా ఉత్సవాల్లో పౌరాణిక పాత్రలు పోషించేవారని.. ఆ రకంగా తండ్రిని చూస్తూ త్రిప్తి డిమ్రి కూడా నటి కావాలని ఈ రంగం వైపు అడుగులు వేసింది.
యాడ్స్ ద్వారా గుర్తింపు..
కెరీర్ ప్రారంభంలో పలు కమర్షియల్ యాడ్స్‌లో కనిపించింది ఈ ముద్దగుమ్మ. ముఖ్యంగా సంతూర్ యాడ్‌లో "సంతోర్ మమ్మీ"గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలానే గుడ్ ఎర్త్, పాండ్స్, హిమాలయ వంటి పలు బ్రాండ్‌ల ప్రకటనల్లో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించింది.
సినిమా కెరీర్..
త్రిప్తి డిమ్రి.. 2017లో Poster Boys అనే కామెడీ సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అదే ఏడాదిలోనే Laila Majnu అనే ప్రేమకథా చిత్రంలో లీడ్ రోల్ పోషించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆడకపోయినా, తృప్తికి నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత 2019లో నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన Bullbul అనే మిస్టరీ డ్రామా ఆమెకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చింది. 2022లో వచ్చిన Qala అనే నెట్‌ఫ్లిక్స్ మ్యూజికల్ డ్రామాకు సైతం మంచి ఆదరణ లభించింది. ఇక యానిమల్ చిత్రంతో ఈ అమ్మడి దశ తిరిగింది.
దీంతో ఇప్పుడు సంతూర్ మమ్మీ నుంచి నేషనల్ క్రష్ అయ్యిందంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
-
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
రిలీజ్‌కి ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రికార్డ్.. చిన్న సినిమా కాదయ్యో !! -
తెలుగులో తొలి ఏఐ సినిమా! -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
కొత్త `రామాయణం`- ప్రభాస్ మూవీపై భారీ ట్రోల్స్ -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
7.5 గంటల సినిమా? ఇండియన్ సినీ హిస్టరీలో బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్! -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’











Click it and Unblock the Notifications