భార్య ఉండగానే రెండో పెళ్లి కోసం మతం మార్పు.. కానీ చివరికి !
బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఆరు దశాబ్దాలుగా సినిమా రంగంలో తన ప్రతిభతో.. సూపర్ స్టార్ గా కొనసాగుతూ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. అయితే ప్రస్తుతం శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తడంతో ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పాత సంఘటనలు, ఆసక్తికర విషయాలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
రెండు వివాహాలు..
ధర్మేంద్ర జీవితంలోని అత్యంత చర్చనీయాంశమైన అంశం ఆయన రెండు వివాహాలు. మొదట ఆయన ప్రకాశ్ కౌర్ను వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు - సన్నీ డియోల్ మరియు బాబీ డియోల్. కానీ తర్వాత ఆయన జీవితంలో ప్రవేశించింది బాలీవుడ్ "డ్రీమ్ గర్ల్" హేమామాలిని. ఆ సమయంలో ధర్మేంద్రకు వివాహం అయినప్పటికీ.. హేమాతో బంధం ప్రేమగా మారింది.

ధర్మేంద్ర-హేమామాలిని జంటగా నటించిన 'శరాఫత్', 'తుమ్ హసీన్ మై జవాన్', 'సీతా ఔర్ గీతా', 'డ్రీమ్ గర్ల్', 'శోల్ే' వంటి సినిమాలు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ పొందాయి. ఇదే సమయంలో, 'తుమ్ హసీన్ మై జవాన్' (1970) చిత్ర షూటింగ్‌లో వీరి మధ్య ప్రేమ చిగురించింది. తెరమీద జంటగా కనిపించిన వీరు నిజజీవితంలోనూ ప్రేమలో పడ్డారు. కానీ ఆ కాలంలో వారి ప్రేమ అనేక అడ్డంకులను ఎదుర్కొంది. హేమామాలిని అత్యంత గౌరవనీయమైన నటీమణి కాగా.. ధర్మేంద్ర వివాహితుడు. ఈ కారణంగా వారి బంధం పబ్లిక్ డిస్కషన్‌గా మారింది.
మతం మార్పు..
హిందూ వివాహ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకోవడం చట్టరీత్యా సాధ్యం కాదు. ధర్మేంద్ర తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. కానీ హేమామాలినిని కూడా వదిలి ఉండలేకపోయారు. దీంతో ఇద్దరూ మతమార్పిడి నిర్ణయం తీసుకున్నారు. 1979లో ధర్మేంద్ర ఇస్లాం మతం స్వీకరించి తన పేరును దిలావర్ ఖాన్ కేవల్ కృష్ణగా మార్చుకున్నారు. హేమామాలిని కూడా ముస్లిం మతం స్వీకరించి ఐషా బీ ఆర్ చక్రవర్తిగా మారారు. ఆ తరువాత 1980లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు.
వివాహం అనంతరం ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు పుట్టారు. ఇషా డియోల్ (1982) మరియు అహానా డియోల్ (1985). ఈ ఇద్దరూ కూడా తమ తల్లి అడుగుజాడల్లో నడుస్తూ బాలీవుడ్‌లో అడుగు పెట్టారు.
ఇంకా ధర్మేంద్రకు మొదటి భార్య ప్రకాశ్ కౌర్ నుండి ఇద్దరు కుమారులు ఉన్న విషయం తెలిసిందే. సన్నీ డియోల్ , బాబీ డియోల్ ఇద్దరూ బాలీవుడ్‌లో హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ధర్మేంద్ర తన కెరీర్‌లో 300కు పైగా సినిమాల్లో నటించారు. 'షో లే ', 'చుప్కే చుప్కే', 'యాదోన్ కీ బారాత్', 'సత్యకాం', 'దోస్తీ', 'దిల్ లాగీ', 'అప్నే', 'యమ్లా పగ్లా దీవానా' వంటి చిత్రాలు భారీ హిట్ అందుకున్నాయి. హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ గా పిలవబడిన ఆయనకు యాక్షన్, కామెడీ, డ్రామా సహా అన్ని జోనర్ లలో సత్తా చాటారు.
అవార్డులు & గౌరవాలు..
సినీ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా ధర్మేంద్ర అనేక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, మరియు భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ గౌరవం అందుకున్నారు.
ఆయన కృషి వల్లే 60లు, 70లు, 80ల దశాబ్దాల్లో బాలీవుడ్‌కి బంగారు యుగం వచ్చింది. తమ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ.. ధర్మేంద్ర, హేమామాలిని జంట ఇప్పటికీ బాలీవుడ్‌లో అత్యంత అందమైన ప్రేమ కథగా గుర్తించబడుతుంది.












Click it and Unblock the Notifications