హీరో రాజశేఖర్‌ని "డాడీ" అని పిలిచి.. ఆ తర్వాత జోడీగా చేసిన నటి ఎవరంటే ??
సినీ పరిశ్రమలో హీరోహీరోయిన్ల విషయంలో ఆసక్తికరమైన పరిస్థితులు చోటు చేసుకోవడం సహజమే. ఒక చిత్రంలో చెల్లిగా నటించిన వారితో.. మరో మూవీలో హీరోయిన్ గా కనిపించాల్సిన ఎదురవుతూనే ఉంటాయి. అలానే ఒకప్పుడు హీరో పక్కన హీరోయిన్ గా చేసిన నటీమణులు.. కాలక్రమేణా తల్లి పాత్రలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అదంతా కేవలం నటనలో భాగంగానే పరిగణించి నటిస్తూ ఉంటారు. అయితే ఈ తరహా ఘటనే హీరో రాజశేఖర్‌కు కూడా ఎదురైనట్టు తెలుస్తోంది.
ఫిబ్రవరి 4, 1962న జన్మించిన ఆయన.. తమిళనాడులోని చెన్నైలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత వైద్య వృత్తిని వదిలి సినిమాల వైపు అడుగులు వేశారు. 1980ల చివర్లో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టిన రాజశేఖర్, తొలినాళ్లలో విలన్, సపోర్టింగ్ పాత్రలు చేసినా... హీరోగా మారిన తర్వాత పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా గుర్తింపు పొందారు. నిజ జీవితంలో డాక్టర్ అయినప్పటికీ, తెరపై పోలీస్, ఆర్మీ ఆఫీసర్, సామాన్యుడిగా విభిన్న పాత్రల్లో మెప్పించారు. ముఖ్యంగా తన సహజ నటన, యాక్షన్ చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

అన్నయ్య, అల్లరి ప్రియుడు, సింహా రాశి, గోరింటాకు, ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే సహా పలు చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిన ఆయన.. మధ్యలో పలు చిత్రాలతో ప్రేక్షకులను నిరాశ పరిచారు. ఈ క్రమంలోనే 2017లో వచ్చిన గరుడ వేగ మూవీ.. రాజశేఖర్ కెరీర్ కి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా కల్కి చిత్రంతో హిట్ కొట్టగా.. చివరిగా శేఖర్ మూవీలో మానసిక వైద్యుడి పాత్రలో మెప్పించారు. కానీ ఆశించిన స్థాయిలో ఆ మూవీ ప్రేక్షకులను అలరించలేకపోయింది.
అప్పుడు డాడీ.. ఆ తర్వాత హీరో..
1989లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన 'మమతల కోవెల' చిత్రంలో ఆయన నటించారు. ఇందులో సుహాసిని కథానాయికగా చేయగా.. నటి రాశి ఆయనకు కూతురుగా 'బేబీ విజయ' పాత్రలో కనిపించింది. కానీ పదేళ్ళ తర్వాత రాజశేఖర్ హీరోగా నటించిన 'నేటి గాంధీ' చిత్రంలో రాశి హీరోయిన్ గా మెప్పించింది. ఇందులో రాజశేఖర్, రాశిల మధ్య కెమిస్ట్రీకి కూడా మంచి పేరొచ్చింది. ఇలా పలువురు హీరోలకు, హీరోయిన్లకు కూడా జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం ఈ యాంగ్రీ మెన్ కొంత విరామం తర్వాత వెండితెరపై తిరిగి మెరవనున్నారు. ఇటీవల ఆయన హీరోగా నటించిన చిత్రాలు ఆదరణ పొందకపోవడంతో.. బలమైన పాత్రలను ఎంచుకోవడంపై దృష్టి సారించారు. ప్రస్తుతం శర్వానంద్ కథానాయకుడిగా రూపొందుతున్న 'బైకర్' సినిమాలో ఆయన ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇది కాకుండా మరో రెండు చిత్రాలలోనూ కథానాయకుడిగా కనిపించనున్నారు. దీంతో రాజశేఖర్ మళ్లీ సక్సెస్ జర్నీ కొనసాగించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications