సినిమాలకు గుడ్ బై చెప్పిన స్టార్ హీరోయిన్.. చివరకు ఇలా !
నటి జుం జుం బెనర్జీ అలియాస్ రచన బెనర్జీ.. ఈ పేరు చెప్తే గుర్తు పట్టకపోవచ్చేమో కానీ ఆమెని చూసిన.. నటించిన సినిమాల పేర్లు చెప్పినా ఠక్కున గుర్తుకు వచ్చేస్తారు. 1990 చివర్లో తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే టాప్ రేంజ్ నటిగా ఎదిగారు. తెలుగు సినిమాలతో పాటు రచన తమిళం, హిందీ, కన్నడ, ఒడియా భాషల్లోనూ నటించారు. ప్రతి భాషలోనూ ఆమె నటనకు ప్రత్యేకమైన ప్రశంసలు లభించాయి.
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్..
రచన తొలి పెద్ద బ్రేక్ వచ్చిన చిత్రం 'కన్యాదానం'. ఈ సినిమా తర్వాత ఆమెకు టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వచ్చాయి. అందం అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయి గుర్తింపు సంపాదించారు ఈ ముద్దుగుమ్మ. చిరంజీవి, మోహన్ బాబు, శ్రీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకొని.. 'బావగారూ బాగున్నారా?', 'లాహిరి లాహిరి లాహిరిలో', 'సూర్యవంశం', 'మావిడాకులు', 'సుల్తాన్', 'రాయుడు' వంటి హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే తన వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇచ్చి సినిమాలకు గుడ్ బై చెప్పేశారు.

పెళ్లి & పిల్లలు..
2007లో వ్యాపారవేత్త ప్రొబల్ బసును వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వివాహం అనంతరం రచన సినిమాల నుండి కొంతకాలం దూరంగా ఉన్నారు.
పొలిటికల్ ఎంట్రీ..
గత ఏడాది రచన బెనర్జీ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకు మద్దతుగా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో చేరారు. హుగ్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రచన, ప్రజల్లో విస్తృతమైన ఆదరణ సంపాదించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రజాసేవలో తనదైన ముద్ర వేస్తూ ఎంపీగా చురుకుగా పనిచేస్తున్నారు.

మరోవైపు అభిమానులతో సోషల్ మీడియా ద్వారా నిరంతరం టచ్‌లో ఉంటారు రచన. తన కుటుంబ ఫోటోలు, జ్ఞాపకాలు తరచుగా అభిమానులతో పంచుకుంటారు. దాదాపు 50 ఏళ్ల వయసులో కూడా ఆమె అందం, ఫిట్‌నెస్ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో అభిమానులు తరచూ ఆమెకు "ఏజ్‌లెస్ బ్యూటీ"గా కాంప్లిమెంట్లు ఇస్తుంటారు.













Click it and Unblock the Notifications