ఇరుముడి ఎఫెక్ట్: అయ్యప్ప మాల ధరించిన దర్శకుడు, నిర్మాత..
ఈ ఏడాది తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల్లో 'ఇరుముడి' ఒకటి. మాస్ మహారాజ రవితేజకు బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రవితేజ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా ఈ మూవీలో డైరెక్టర్ శివ నిర్వాణ విజన్ కు అనుగుణంగా జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది.
అలాగే మూవీలో రవితేజ ఆయన కూతురు మణెమ్మ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే పండాయి. దాంతో సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. దాంతో ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ మూవీలో రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించగా.. కూతురి పాత్రలో బేబీ నక్షత్ర నటించి మెప్పించారు. వీరితో పాటు సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర తదితరులు కీలక పాత్రల్లో తమ నటనతో సినిమా స్థాయిని మరింత పెంచారు. డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై దీన్ని రవిశంకర్, నవీన్ ఎర్నేని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఇక థియేటర్లలో భారీ వసూల్లు సాధించిన ఈ మూవీ సెప్టెంబర్ 18న ఓటీటీలోనూ రిలీజ్ అయింది. ఇరుముడి డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ డివోషనల్ మూవీ స్ట్రీమింగ్ అయి పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఇరుముడి ఇచ్చిన భారీ సక్సెస్ తో ఇప్పుడు రవితేజ మరో రెండు మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే దర్శకుడు శివ నిర్వాణ ప్రస్తుతం మరో కథను రాసే పనిలో ఉన్నారు. మరోవైపు ఈ సినిమా సాధించిన ఘన విజయంతో ఆధ్యాత్మిక బాట పట్టారు చిత్ర దర్శకుడు శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై. రవిశంకర్. ఈ మేరకు వీళ్లిద్దరూ అయ్యప్ప మాల ధరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇరుముడి సినిమా భారీ సక్సెస్ తర్వాత స్వామివారిపై తమ భక్తిని చాటుకుంటూ దీక్ష చేపట్టడం అభిమానుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.












Click it and Unblock the Notifications
