విశ్వక్ సేన్‌కు ఎన్టీఆర్ వార్నింగ్, వైసీపీ వాళ్లతో ఎందుకు పెట్టుకున్నావ్..?

తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన 'లైలా' సినిమా గురించే చర్చించుకుంటున్నారు.'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు, జనసేన సభ్యుడు పృథ్వి చేసిన కామెంట్స్ 'లైలా' సినిమాను ఇరకాటంలోకి నెట్టాయి.'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వి వైసీపీకి వచ్చిన 11 సీట్ల గురించి చులకనగా మాట్లాడారు.వైసీపీని విమర్శించడంతో ఆ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా పృథ్వితో పాటు, 'లైలా' సినిమాను కూడా టార్గెట్ చేసుకుని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

బాయ్‌కాట్ లైలా అంటూ నేషనల్‌ లేవల్లో వైసీపీ శ్రేణులు 'లైలా' సినిమాకు వ్యతిరేకంగా ట్రెండ్ చేశారు.క్షమాపణలు చెప్పకపోతే , సినిమాను బ్యాన్ చేస్తామని వైసీపీ శ్రేణులు హెచ్చరించాయి.దాదాపు లక్షకు పైగానే 'లైలా' సినిమాకు వ్యతిరేకంగా ట్వీట్లు వెలిశాయి.దీంతో దిగొచ్చిన చిత్ర యూనిట్..క్షమాపణలు చెప్పడం జరిగింది.హీరో విశ్వక్ సేన్‌తో పాటు చిత్ర నిర్మాత మీడియా సమావేశం నిర్వహించి జరిగిన ఘటనకు క్షమాపణలు చెప్పడం జరిగింది.

Actor Vishwak Sen apologies behind ntr

పృథ్వి మాట్లాడిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదని, ఆయన ఏం మాట్లాడతారో మాకు తెలియదని, ఆయన మాట్లాడే సమయంలో నేను చిరంజీవిని రీసివ్ చేసుకోవడానికి వెళ్లానని, ఆయన అలా మాట్లాడకుండా ఉండాల్సిందని, అయినప్పటికీ మా సినిమా స్టేజ్ మీద జరిగింది కాబట్టి తాము క్షమాపణలు చెబుతున్నామని విశ్వక్ సేన్ తెలిపారు.అయితే విశ్వక్ సేన్ ఇలా మీడియా సమావేశం పెట్టడం వెనుక ఇద్దరు సినీ పెద్దలున్నారనే ప్రచారం జరుగుతోంది.

స్టార్ హీరో ఎన్టీఆర్‌తో పాటు, నిర్మాత దిల్ రాజు విశ్వక్ సేన్‌ను హెచ్చరించడంతోనే ఆయన ప్రెస్ పెట్టారని తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌తో విశ్వక్ సేన్ క్లోజ్‌గా ఉంటారు. ఆ కారణంగానే ఇది పెద్ద వివాదం కాకూడదని ఎన్టీఆర్ ఇచ్చిన సలహాతోనే విశ్వక్ సేన్ మీడియా సమావేశం పెట్టారని సమాచారం.అలాగే 'గేమ్ ఛేంజర్' విషయంలో జరిగిన తప్పు, 'లైలా' సినిమాకు జరగకూడదని దిల్ రాజు సైతం విశ్వక్ సేన్‌కు సూచించినట్టు తెలుస్తోంది. వీరిద్దరి కారణంగానే విశ్వక్ సేన్ మీడియా సమావేశం పెట్టి జరిగిన ఘటనలో మా తప్పు లేదని, అయినప్పటికీ మా ఈవెంట్‌లో జరిగింది కాబట్టి, క్షమాపణలు చెబుతున్నామని విశ్వక్ సేన్ తెలిపారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+