మొన్నేగా పెళ్లైంది...అప్పుడే తల్లైందా..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇటీవలే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జహీర్ ఇక్బాల్ అనే నటుడితో గత రెండేళ్లుగా రిలేషన్‌లో ఉన్న సోనాక్షి సిన్హా తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకుంది. జూన్ 23న ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు సమక్షంలో ఈ వేడుక సింపుల్‌గా జరిగింది. సైలెంట్‌గా వివాహం చేసుకున్న సోనాక్షి, తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే పెళ్లై ఐదు రోజులకే సోనాక్షి సిన్హా హాస్పిటల్‌కు వెళ్లింది. దీంతో సోనాక్షి తల్లి కాబోతుందంటూ వార్తలొచ్చాయి.
సోనాక్షి సిన్హా పెళ్లి కాకముందే తల్లైందని , అందుకే ఆమె ఆస్పత్రికి వెళ్లారంటూ కథనాలు అల్లేస్తున్నారు. అమలాపాల్ మాదిరిగానే ప్రియుడు వల్ల తల్లి కావడంతోనే సోనాక్షి సిన్హా సైలెంట్‌గా వివాహం చేసుకుందని..ఇప్పుడు అసలు విషయం బయటపడిందంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ అయిందని వస్తోన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. అలాంటిది ఏమీ లేదని ఈ భామ క్లారిటీ ఇచ్చింది.

సోనాక్షి సిన్హా తండ్రి శత్రుఘ్ని సిన్హా అనారోగ్యంతో ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేర్చారు. తండ్రిని చూడటానికే సోనాక్షి అక్కడకు వెళ్లారని తెలుస్తోంది. తండ్రిని కలిసేందుకు ఇలా ఆస్పత్రికి వచ్చి వెళ్లడంతో పుకార్లు వచ్చాయి తప్పితే ఇంకేం లేదని తెలుస్తోంది.సోనాక్షి పెళ్లి సమయంలో హడావిడి కారణంగా కాస్త ఒత్తిడికి లోనవడంతో అతడు కాస్త అనారోగ్యానికి గురైనట్లు సోనాక్షి సిన్హా తెలిపారు. తాజాగా బాలీవుడ్ మీడియా కథనాల్లో సోనాక్షి తల్లి కాబోతుందంటూ వార్తలు వెలిశాయి.
దీపావళి సంబరాల్లో భాగంగా సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బాల్ స్పెషల్ పార్టీకి హాజరయ్యారు. ఈ అందమైన జంట కలిసి బయటకు వచ్చినప్పుడల్లా కెమెరాల ముందు ఫోజులివ్వడం కనిపిస్తోంది. దీనిలో భాగంగానే ఈ జంట ఒక చిన్న ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. సోనాక్షి - జహీర్ ఇద్దరూ అద్భుతంగా కనిపించారు. అయితే ఈ సమయంలో సోనాక్షి పొట్ట దగ్గర కాస్తా ఎత్తుగా కనిపించింది. దీంతో ఆమె గర్భవతి అయిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై సోనాక్షి సిన్హా ఇప్పటి వరకు స్పందించలేదు.












Click it and Unblock the Notifications