అంతా జనసేన వ్యక్తే చేశాడు.. బండారం బయటపెట్టిన దిల్ రాజు
సినిమా థియేటర్ల బంద్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఏప్రిల్ 19న గోదావరి జిల్లాల్లో ఎగ్జిబిటర్లు తమ ఇబ్బందులను లేవనెత్తారని, ఏప్రిల్ 26న జరిగిన గిల్డ్ మీటింగ్‌లో ఈ విషయం తమకు తెలిసిందని దిల్ రాజు తెలిపారు. ఎగ్జిబిటర్ల డిమాండ్లకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య ఈ వివాదం ఉందని ఆయన స్పష్టం చేశారు.ఎగ్జిబిటర్ల వివాదం, పవన్ కళ్యాణ్ సినిమా విడుదల వాయిదా, పైరసీ సమస్యలు, ఛాంబర్ లోని ఐక్యత లేమి వంటి పలు విషయాలపై స్పందించారు.
మే 18న ఎగ్జిబిటర్ల మీటింగ్ జరిగిందని, అయితే 'థియేటర్స్ బంద్' అనే మాటలో వాస్తవం లేదని దిల్ రాజు స్పష్టం చేశారు. రెంటల్ పర్సెంటేజ్ కావాలని అడుగుతున్నారని, బంద్ మాటను తాను ఖండించనని చెప్పారు. ఛాంబర్‌లో ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. మాకు పర్సెంటేజ్ విధానం కోసం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడాలి అన్నారు. చర్చలే జరగకుండా బంద్ ఏంటి? ఎవరూ ఖండించకపోవడం తప్పు. పరిశ్రమలో ఎవరి దారి వారిదని దిల్ రాజు వ్యాఖ్యానించారు.

అసలు ఈ వివాదం గోదావరి జిల్లాల్లోనే మొదలైందని దిల్ రాజు తెలిపారు. అసలు ఏం జరిగిందో ఆయన వివరించే ప్రయత్నం చేశారు.ఈ వివాదానికి జనసేనకు చెందిన కీలక వ్యక్తే కారణమని దిల్ రాజు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 19న జరిగిన సమావేశంలో ఈ సమస్యను తీసుకువచ్చింది సత్యనారాయణ అనే వ్యక్తి అని దిల్ రాజు పేర్కొన్నారు.
అంత జనసేన వ్యక్తే చేసాడు - దిల్‌రాజు#DilRaju #PawanKalyan #Janasena #ReelTalk #AndhraPradesh #OIUpdates #OITelugu pic.twitter.com/gJKKVJUPHq
— oneindiatelugu (@oneindiatelugu) May 26, 2025
సదరు వ్యక్తి ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అని అతని వల్లే ఈ వివాదం వచ్చిందనే చెప్పే ప్రయత్నం దిల్ రాజు చేశారు.డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్‌లో సమస్యలు ఉన్నా సినిమాలు విడుదల చేస్తాం. మా థియేటర్స్ మాతో ఉన్నాయి. 56 రోజులు షూటింగ్ ఆపి ఏమీ సాధించలేదు. కోవిడ్ టైంలో మాత్రమే థియేటర్లు మూతపడ్డాయని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు. కళ్యాణ్ సినిమా ఉందని తన పేరు ఇండైరెక్ట్‌గా చెప్పారని, అయితే పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications