నారా లోకేష్ గొప్ప మనసు.. ఎన్టీఆర్ హీరోయిన్ ప్రశంసలు..!

ఏపీ విద్య, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. SMA టైప్-1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన చిన్నారి పునర్వికకు మంత్రి నారా లోకేష్ ఆపద్భాంధవుడిలా అండగా నిలిచారు. పునర్విక వైద్యానికి రూ. 16 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే విరాళాల ద్వారా ఇప్పటికే రూ. 10 కోట్లు వచ్చాయి. అయితే మిగిలిన రూ.6 కోట్లు సమకూర్చే బాధ్యత తనదేనని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. దీంతో లోకేష్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఇందులో భాగంగానే బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్, అలనాటి తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నారా లోకేష్ పై ప్రశంసలు కురిపించారు. 'మానవత్వం ఇంకా బతికేఉంది.. నిజంగా ఇది ప్రశంసనీయమైనది'.. అంటూ ఎక్స్ వేదికగా నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జాన్వీ కపూర్ గతంలో ఎన్టీఆర్ తో 'దేవర'చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో తంగం క్యారెక్టర్ తో అలరించింది జాన్వీ కపూర్. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో నటిస్తోంది.

ఇక కర్నూలు జిల్లాకు చెందిన బాలిక పునర్విక.. SMA టైప్-1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఇది జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి పిల్లల కండరాలను బలహీన పరుస్తుంది. చిన్నారి చికిత్సకు రూ.16 కోట్లు అవసరం. అయితే ఇప్పటి వరకు ప్రజలు విరాళాలు సేకరించడం ద్వారా రూ.10 కోట్లు వచ్చింది. ఇంకా మరో రూ.6 కోట్లు అవసరం. అయితే రూ. 6 కోట్ల రూపాయలపై మంత్రి నారా లోకేష్ కీలక ట్వీట్ చేశారు. ఆ మొత్తం అందేలా చూసే బాధ్యత తనదేనని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

janhvikapoor Praises minister Nara Lokesh He Has a Great Mind Tollywood Meets Politics Buzz

ఇలాంటి పరిస్థితిలోనూ పునర్విక పోరాడుతున్న తీరు అభినందనీయమని మంత్రి లోకేష్ కొనియాడారు. అయితే ప్రస్తుతం లోకేష్ కు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి జాన్వీ కపూర్.. లోకేష్ పెద్ద మనసుకు ఫిదా అయ్యారు. 'మానవత్వం ఇంకా బతికే ఉంది.. నిజంగా ఇది ప్రశంసనీయమైనది'.. అంటూ ఎక్స్ వేదికగా నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+