పుష్ప-2లో జానీ మాస్టర్ కొరియోగ్రఫీ....? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. తన దగ్గర పని చేస్తోన్న అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్‌పై జానీ అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 376,506,323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నాలుగు రోజులు పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగిన జానీ మాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు. తాజాగా జానీ మాస్టర్ బెయిల్‌పై విడుదలయ్యారు. తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్‌కు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సరిగ్గా ఇదే సమయంలో స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 సినిమాకు సంబంధించి కీలక ఆప్డేట్ వచ్చింది. ఈ సినిమాను తొలుత డిసెంబర్ 6న విడుదల చేస్తామని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

తాజాగా ఈ సినిమాను ఒక రోజు ముందుకు తీసుకువచ్చి, డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నిర్మాతలు సినిమా విశేషాలను వెల్లడించారు. పుష్ప-2 సినిమాను ఆరు భాషల్లో విడుదల చేస్తున్నామని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సమయంలో ఓ మీడియా ప్రతినిధి జానీ మాస్టర్ బెయిల్ మీద బయటకు వచ్చారని,గతంలో మీరు ఆయనతో పుష్ప-2 సినిమాలో ఓ సాంగ్ చేయించాలని చూశారని, ఇప్పుడు జానీ మాస్టర్‌తో ఆ సాంగ్‌కు కొరియోగ్రాఫీ చేయిస్తారా అని నిర్మాతలను ప్రకటించారు.
దీనిపై మైత్రీ నిర్మాతలు స్పందిస్తూ.. ఆ సాంగ్ ఇప్పటికే వేరే కొరియోగ్రాఫర్‌తో చేయించామని క్లారిటీ ఇచ్చారు. దీంతో అల్లు అర్జున్ పుష్ప-2లో జానీ మాస్టర్ ఎటువంటి సాంగ్ చేయడం లేదని తెలిసిపోయింది. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక అల్లు అర్జున్ ఉన్నారనే ప్రచారం జరిగింది. జానీ మాస్టర్ చేత బాధించపడ్డ బాధితురాలిగా అల్లు అర్జున్ అండగా నిలిచారు. తాను నటిస్తోన్న పుష్ప-2 సినిమాలో ఆఫర్ ఇవ్వడం జరిగింది. దీంతో జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక అల్లు అర్జున్ ఉన్నారనే పుకార్లు షికార్లు చేశాయి.












Click it and Unblock the Notifications