జానీ మాస్టర్‌కు షాకిచ్చిన సినీ ఇండస్ట్రీ

టాలీవుడ్‌ ప్రముఖ డ్యాన్స్ మాస్ట‌ర్ , జనసేన కీలక నేత జానీ వివాదంలో చిక్కుకున్నారు. జానీ మాస్టర్‌పై తాజాగా కేసు నమోదయ్యింది. జానీ మాస్టర్ త‌న‌పై లైంగిక వేధించారంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ నేప‌థ్యంలో జానీ మాస్టర్ పై రాయ‌దుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేధిపులకు పాల్పడుతున్నాడని తాజాగా జానీ మాస్ట‌ర్ దగ్గర పని చేసే ఓ మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది.

షూటింగ్ నిమిత్తం చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల‌కు వెళ్ళినప్పుడు తనపై ప‌లు మార్లు అత్యాచారం చేశాడని ఆ యువతి పేర్కొంది. హైదరాబాద్ నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ యువతి కొరియోగ్రాఫ‌ర్ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జానీ మాస్ట‌ర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. అనంత‌రం తదుపరి విచారణ కోసం ఆ కేసును నార్సింగి పోలీసులకు బదిలీ చేశారు.

Johnny Master suspended from the post of president of Choreographers Association

దీంతో నార్సింగ్ పోలీసులు జానీ మాస్ట‌ర్‌పై ఐపిసి సెక్షన్ 376 (రేప్), క్రిమినల్ బెదిరింపు (506) స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2) ఎన్ కింద కేసు నమోదు చేశారు. అయితే, జానీ మాస్టర్‌పై గతంలో కూడా పలు కేసులు న‌మోద‌య్యాయి. జానీ మాస్టర్‌పై కేసు నమోదు కావడంతో ఆయన్ను జనసేన నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ కార్యక్రమాలకు జానీ మాస్టర్ దూరంగా ఉండాలని అధికరికంగా ప్రకటన చేయడం జరిగింది. తాజాగా సినీ ఇండస్ట్రీ సైతం షాకిచ్చినట్టు తెలుస్తోంది.

జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి ఆయనని తొలగించనున్నట్లు సమాచారం. అలాగే అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు అందరూ మీటింగ్ పెట్టుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ ని సస్పెండ్ చేస్తూ లెటర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేసి షాక్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ వివాదంపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+