అయ్యయ్యో.. ఎన్టీఆర్ - నీల్ మూవీకి బ్రేక్.. మనస్పర్థలకు కారణం అదే !
గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఇటీవలే ఎన్టీఆర్ "దేవర" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో కలిసి చేసిన 'వార్ 2'లో కీలక పాత్రలో మెప్పించారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. అలానే కేజీఎఫ్, సలార్ వంటి భారీ హిట్స్ తో ప్రశాంత్ నీల్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. దాంతో నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు.

కాగా ఈ సినిమా కోసమే ఎన్టీఆర్ బక్కచిక్కారు. సుమారుగా 18 కేజీల బరువు తగ్గి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ మూవీ టైటిల్ ఇంకా రివీల్ చేయకపోయినా.. "డ్రాగన్" అనే టైటిల్ ఫిక్స్ అయ్యిందంటూ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేసిన విషయం తెలిసిందే. అలానే మలయాళ సీనియర్ నటులు బిజూ మీనన్.. యంగ్ హీరో టోవినో థామస్ నటిస్తున్నారని కూడా తెలిపారు.
అయితే ఈ మూవీకి సంబందించి ఓ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో ఫుల్ గా హల్ చల్ చేస్తుంది. ఎన్టీఆర్ కు దర్శకుడు ప్రశాంత్ నీల్ కు మధ్య మనస్పర్థలు వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పటి వరకు తీసిన ఈ సినిమా ఫుటేజ్ ను స్క్రాప్ చేసేశారని టాక్ వినిపిస్తుంది. దాంతో ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కారణం ఇదే..!
కాగా ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసేశారు. కానీ కొన్ని సీన్స్ బాగా రాకపోవడంతో రీషూట్ కూడా జరిగింది. కానీ రీ షూట్ లో ప్రశాంత్ తీసిన అవుట్ ఫుట్ పట్ల ఎన్టీఆర్ సంతృప్తిగా లేడని అందుకే స్క్రాప్ చేసినట్టు చెబుతున్నారు. అలాగే కథలో మార్పులు చేర్పులు చేయమని కూడా ఎన్టీఆర్ సూచించనట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా విషయంలో ఇలా జరగడం ఏంటని ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. మరి ఈ వార్తాలపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
𝟮𝟱 𝗝𝗨𝗡𝗘 𝟮𝟬𝟮𝟲…
— #NTRNeel (@NTRNeelFilm) April 29, 2025
The Most striking tale ever to erupt from the Soil of Indian Cinema 💥💥
A special glimpse for the Man of Masses @tarak9999’s birthday.#NTRNeel pic.twitter.com/xg6AjsEUbS












Click it and Unblock the Notifications