'కంగ్రాట్స్ బాల బాబాయ్'.. విభేదాలకు చెక్ పెట్టిన ఎన్టీఆర్
గణతంత్ర దినోత్సవ వేళ పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శనివారం(జనవరి25) ప్రకటించింది.ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్ , 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు మొత్తం ఏడు పద్మ అవార్డులు దక్కాయి (పద్మ విభూషణ్ 1, పద్మభూషణ్ 1, పద్మశ్రీ 5). తెలంగాణ నుంచి డాక్టర్ దువ్వూరు నాగేశ్వర రెడ్డికి , ఏపీ నుంచి సీనియర్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది.
Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.
— Jr NTR (@tarak9999) January 25, 2025
సినీ రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కడంపై పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలకృష్ణకు పద్మభూషన్ అవార్డు రావడంపై స్పందించారు.ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడిన బాల బాబాయ్ కి హృదయపూర్వక అభినందనలు. ఈ గుర్తింపు మీరు సినిమాకు చేసిన అసమానమైన కృషికి మరియు మీ అవిశ్రాంత ప్రజా సేవకు నిదర్శనం అంటూ ఎన్టీఆర్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు.

గత కొంతకాలంగా బాలకృష్ణ, ఎన్టీఆర్‌ల మధ్య గ్యాప్ కొనసాగుతోంది. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను బాలకృష్ణ దూరం పెడుతూ వస్తున్నారు.తాజాగా బాలకృష్ణకు అవార్డు రావడం, దీనిపై ఎన్టీఆర్ రియాక్డ్ అవడం జరిగింది. దీంతో నందమూరి కుటుంబంలో విభేదాలు తొలగిపోయినట్టే అని అభిమానులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications