సాయి పల్లవి‌పైనే ఆశలు పెట్టుకున్న స్టార్ హీరో కొడుకు

హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే తన ఖాతాలో వేసుకుంది.కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసిందనే చెప్పాలి. ఇక సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తన తొలి తెలుగు సినిమా ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాటపర్వం వరకు అన్ని విభిన్నిమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు.

Junaid Khan hopes on the Sai Pallavi movie on bollywood

కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. తాజాగా సాయి పల్లవికి ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. 'గార్గి' సినిమాలో సాయి పల్లవి నటనగానూ ఈ అవార్డు ఆమెకు దక్కింది. సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. వాటిల్లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు సినిమా కూడా ఉంది. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జపాన్‌లో శరవేగంగా జరుగుతుంది. సమ్మర్‌కి ఈ సినిమా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. గతంలో జునైద్ ఖాన్ 'మహారాజ్' అనే వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమాలో జునైద్ ఖాన్ నటన ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో సాయి పల్లవితో చేస్తోన్న సినిమాపైనే జునైద్ ఖాన్ ఆశలు పెట్టుకున్నాడు. సాయి పల్లవికి నేషనల్ వైడ్ క్రేజ్ ఉండటంతో ఆమెపైనే ఆశలన్నీ పెట్టుకుంది చిత్ర యూనిట్. మరి సాయి పల్లవితో చేసే సినిమా జునైద్‌కి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+