రావణ దహనం చేసిన మొదటి మహిళగా కంగనా రనౌత్ రికార్డ్...
బాలీవుడ్ క్వీన్ అనగానే అందరికి టక్కున గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్. విభిన్నమై కథలలో నటించడమే కాకుండా, వివాదాలలో కూడా ఎప్పడు ముందుంటారు కంగనా. బాలీవుడ్‌లో జరిగే అన్యాయాను బయటపెట్టడంలో ఎప్పుడు ముందుంటారు కంగనా. అంతేకాదు బాలీవుడ్‌లో జరిగే నెపోటిజం, కాస్టింగ్ కౌచ్‌లపై కూడా ఆమె ఎప్పటినుంచో పోరాడుతున్నారు. అయితే, తాజాగా కంగనా రనౌత్‌కు ఓ అరుదైన గౌరవం లభించింది.
ఏ మహిళకు దక్కని అరుదైన అవకాశం: బాలీవుడ్‌లోనే కాదు.. రాజకీయాలపరంగా చూసినా ఇంతవరకూ ఏ మహిళకు దక్కని అరుదైన అవకాశం ఈ క్వీన్‌కు దక్కింది. విజయదశమి సందర్భంగా ప్రతి సంవత్సరం దేశ రాజధాని ఢిల్లిలోని రామ్‌లీలా మైదానంలో రావణాసుడి దిష్టిబొమ్మను దహనం చేసే కార్యక్రమం ఉంటుంది. అయితే, ఈసారి ఆ కార్యక్రమానికి బాలీవుడ్ క్వీన్ హాజరయ్యారు.

అంతేకాదు, స్వయంగా ఆమె ఈ రావణ దహనం చేశారు. ఓ మహిళ ఇలాంటి కార్యక్రమానికి వెళ్లి రావణ దహనం చేయడం ఇదే తొలిసారి. అంతేకాదు యాభై ఏళ్ల చరిత్రలో ఓ మహిళ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఇదే మొదటిసారి అని అంటున్నారు నెటిజన్లు. దీంతో రావణ దహనం చేసిన తొలి మహిళగా కంగనా పేరు రికార్డుకెక్కింది.
సాంప్రదాయ చీరకట్టులో కంగనా: ఢిల్లీలోని రామ్‌లీలాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి కంగనా సంప్రదాయ దుస్తుల్లో వచ్చి అందరినీ అలరించారు. ఎర్రటి చీర ధరించి అక్కడివారిందరి దృష్టిని ఆకర్షించారు. జై శ్రీరామ్ నినాదంతో రావణ దహనం చేశారు.
𝗞𝗮𝗻𝗴𝗮𝗻𝗮 𝗥𝗮𝗻𝗮𝘂𝘁 made history by being the first woman to set ablaze 𝗥𝗮𝘃𝗮𝗻𝗮's effigy at Delhi's Lav Kush Ramlila event. She shot an arrow to set fire to the demon king's effigy while chanting '𝗝𝗮𝗶 𝗦𝗵𝗿𝗲𝗲 𝗥𝗮𝗺' 🙏🏻#KanganaRanaut #Dusshera2023… pic.twitter.com/CPt8RRiI3G
— Rahul Chauhan (@RahulCh9290) October 25, 2023
దీనితో పాటు కుంభకర్ణ, మేఘనాథుల దిష్టిబొమ్మలను కూడా దహనం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ఇప్పడు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ ఢిల్లీలో మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications