జూన్ 14న రిలీజ్ కానున్న కంగ‌నా ర‌నౌత్ ఎమ‌ర్జెన్సీ సినిమా...

బాలీవుడ్ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకుంది కంగ‌నా ర‌నౌత్‌. బాలీవుడ్‌లో హీరోయిన్ ఒరియెంటెడ్ చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌లోని మంచి న‌టిని అంద‌రికి ప‌రిచ‌యం చేసింది. స‌క్సెస్‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలు తీసుకుంటుంది పోతుంది ఈ బ్యూటీ. ఇక‌, ఈ బ్యూటీ తెలుగులో లారెన్స్‌తో క‌లిసి చంద్ర‌ముఖి 2లో నటించిన విష‌యం తెలిసిందే. న‌టిగానే కాకుండా ఆమె నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. ఇప్ప‌డు ద‌ర్శ‌క‌త్వం కూడా చేస్తున్నారు. తాజాగా కంగనా రనౌత్ హీరోయిన్‌‌గా నటిస్తున్న చిత్రం ఎమ‌ర్జెన్సీ. ఇందులో మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ పాత్ర‌ను కంగ‌నా పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఆమె దర్శకత్వం కూడా వ‌హిస్తున్నారు.

1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ప్రకటించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. 1977 వరకూ ఇరవై ఒక్క నెలల పాటు దేశంలో అత్యవసర పరిస్థితి నెల‌కొంది. అప్ప‌టి ఎమర్జెన్సీ నేప‌థ్యంతో సాగే పొలిటికల్ డ్రామా ఈ సినిమా. ఈ సినిమాను న‌వంబ‌ర్ 2023లో విడుద‌ల చేయాల్సింది. కానీ, అది కాస్త వాయిదా ప‌డుతూనే ఉంది. తాజాగా ఈ సినిమా రీలిజ్ కొత్త డేట్ వ‌చ్చేసింది. ఈ న్యూస్ కాస్త సోష‌ల్‌మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

 Kangana Ranauts emergency movie to release on June 14...

తాజాగా ఎమ‌ర్జ‌న్సీ సినిమా కొత్త రిలీజ్‌‌ డేట్‌‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేయ‌డం జ‌రిగింది. జూన్ 14, 2024 న ఎమ‌ర్జెన్సీ చిత్రం విడుదల చేయబోతున్నట్టు కంగనా రనౌత్‌‌ సోషల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా ఆమె విడుదల చేసిన పోస్టర్ నెట్టింట్లో తెగ హాల్చ‌ల్ చేస్తోంది. ఈ పోస్ట‌ర్ లో ఇందిరాగాంధీ గెటప్‌‌లో పవర్‌‌‌‌ఫుల్ వుమెన్‌గా క‌నిపిస్తున్నారు కంగ‌నా ర‌నౌత్‌. ఎమ‌ర్జెన్సీ సినిమాను కంగ‌నా ర‌నౌత్ సొంత‌నిర్మాణ సంస్థ అయిన మణికర్ణిక ఫిలింస్‌‌ నిర్మించ‌డం విశేషం. ఇక‌, ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నాడు. ఈ సినిమాలో ప‌లువురు బాలీవుడ్ తార‌లు కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. ఎమ‌‌ర్జెన్సీని వ్యతిరేకించిన జ‌‌య‌‌ప్రకాశ్‌‌ నారాయ‌‌ణ్ పాత్రలో అనుపమ్‌‌ ఖేర్ న‌టిస్తున్నారు. వీరితోపాటు మాజీ ప్రధాని వాజ్‌‌పేయి పాత్రలో శ్రేయాస్‌‌ తల్పడే ఉన్నారు. మరో కీలకపాత్ర‌లో న‌టి భూమిక క‌నిపించ‌నున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+