Karthika deepam 2 December 15th:కాంచనకు శ్రీధర్ సర్‌ప్రైజ్- దీప కౌంటర్..!!
'కార్తీకదీపం 2' నేటి ఎపిసోడ్ (541వ ఎపిసోడ్) హైడ్రామాతో సాగింది. జ్యోత్స్న చేసిన స్కామ్‌లపై పోలీసులు అరెస్ట్ చేసినట్లు పారిజాతానికి పీడకల రాగా, ఆమె భయపడింది. అలాగే, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్న సుమిత్ర ఎంతకు లేవకపోవడంతో ఆందోళన కలిగింది. "జ్యోత్స్న సుమిత్ర కూతురు కాదు కదా" అని పారు నోరుజారడంతో ఇంట్లో కలకలం రేగింది.
శ్రీధర్ ప్లాన్ - దీప సలహా
శ్రీధర్, కాంచనకు టిఫిన్ పార్శిల్ పంపి ప్రేమను వ్యక్తం చేయగా, కాంచన గతాన్ని గుర్తు చేసుకుని ఏడ్చింది. మరోవైపు, కాశీ కనిపించకపోవడంతో కార్తీక్, దీపలకు అనుమానం వచ్చింది. కాశీ బాధను అర్థం చేసుకున్న కార్తీక్, "లండన్‌లో చదువుకున్న నేను డ్రైవర్‌గా ఉన్నప్పుడు, వైజాగ్ చదువుకున్న నువ్వు బాధపడకూడదు" అంటూ హితబోధ చేసి, రెస్టారెంట్ వ్యాపారం నేర్చుకోమని సలహా ఇచ్చాడు.

శ్రీధర్ తన భార్య కాంచన బాధను దీపతో పంచుకుని, "కాంచనతో మాట్లాడి నా పక్కన నిలబెట్టగలవా?" అని సహాయం అడిగాడు. దానికి దీప, "అత్తయ్యను అడగడం మానేసి, ఎదురుపడకుండా ఉండండి, అప్పుడు ఆమె మనసులో మార్పు వస్తుంది" అని సలహా ఇచ్చింది.
జ్యోత్స్నపై దీప కౌంటర్
దీపను ఇంటి దగ్గర దించడానికి కాశీ కారులో రావడంతో, "మీ మామగారు తన అల్లుడినే నీకు డ్రైవర్‌ని చేశారని" జ్యోత్స్న సెటైర్లు వేసింది. దానికి దీప, "అడ్డమైన వాళ్లు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు, మనం చెవిటివాళ్లలా ముందుకు పోవాలని మా బావ (శ్రీధర్) చెప్పాడు" అని గట్టి కౌంటర్ ఇచ్చింది.చివరికి, జ్యోత్స్న రెస్టారెంట్‌కు మంచి రెస్పాన్స్ వస్తుందని శ్రీధర్, కార్తీక్‌లు సంతోషంగా చెప్పుకున్నారు.ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే.












Click it and Unblock the Notifications