Karthika deepam 2 December 22nd:పారిజాతం'విష'ప్రచారం-దీపపై నిందలు..!!
బుల్లితెర ప్రేక్షకులను ఊపిరి బిగబట్టేలా చేస్తున్న 'కార్తీకదీపం 2' సీరియల్ ఇప్పుడు అత్యంత కీలక ఘట్టానికి చేరుకుంది. నిన్నటి ఎపిసోడ్‌లో సుమిత్ర రక్తం కక్కుకోవడం, శ్రీధర్ అరెస్ట్ వీడియో బయటకు రావడం వంటి పరిణామాలు చూశాం. మరి నేడు డిసెంబర్ 22వ తేదీ, 547వ ఎపిసోడ్‌లో జరిగిన సంచలన విషయాలు ఇప్పుడు చూద్దాం.
కాశీ షాకింగ్ సాక్ష్యం.. జైలులోనే శ్రీధర్!
నేటి ఎపిసోడ్‌లో అసలు ట్విస్ట్ పోలీస్ స్టేషన్‌లో వెలుగు చూసింది. శ్రీధర్‌ను విడిపించేందుకు కార్తీక్, శివన్నారాయణ స్టేషన్‌కు వెళ్లగా.. ఎస్ఐ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. శ్రీధర్‌కు బెయిల్ ఇవ్వడం కుదరదని, ఆయన కల్తీ ఫుడ్ పంచారని సాక్షాత్తూ ఆయన అల్లుడు కాశీనే సాక్ష్యం చెప్పాడని ఎస్ఐ వెల్లడించాడు. "బాలేకపోయినా ఫుడ్ పంచమని మావయ్యే చెప్పారు" అని కాశీ రికార్డ్ చేసిన ఆడియోను పోలీసులకు అందించడంతో శ్రీధర్ చిక్కుల్లో పడ్డాడు. తన అల్లుడు ఎదుగుతాడని ఆశిస్తే, తననే వదిలించుకోవాలని చూశాడని శ్రీధర్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలిచివేసింది.

కాంచనపై పారిజాతం నోటి దురుసు..దీపపై నిందలు!
మరోవైపు పారిజాతం తన విషాన్ని కక్కుతూనే ఉంది. కాంచన వంట గదిలో ఉండగా ఫోన్ చేసి శ్రీధర్ అరెస్ట్ గురించి ఎద్దేవా చేస్తుంది. "మీరు అన్నం పెట్టిన వాళ్ల మీదే తిరగబడతారు.. మీ కుటుంబం మొత్తం మోసగాళ్లే" అంటూ కాంచనను నానా మాటలు అంటుంది. అంతేకాకుండా, ఈ అరెస్ట్‌కు కారణం దీప ఇచ్చిన 'ఫుడ్ ట్రక్' ఐడియానే అని, దీప వల్లే శ్రీధర్ రోడ్డున పడ్డాడని కాంచన మనసులో దీపపై ద్వేషం నూరిపోస్తుంది. దీంతో కాంచన కూడా దీపపై కోపంతో రగిలిపోతుంది.
బిడ్డ జోలికి వస్తే అంతు చూస్తా.. దీప వార్నింగ్!
జ్యోత్స్న, పారిజాతం కలిసి దీపను మానసికంగా దెబ్బకొట్టాలని చూస్తారు. "నువ్వు ఇచ్చిన ఒకే ఒక్క ఐడియా అందరి జీవితాల్ని నాశనం చేసింది" అని జ్యోత్స్న అంటే.. "నీ మెడలో తాళి పడగానే కార్తీక్ రోడ్డున పడ్డాడు, నీ బిడ్డ పుడితే ఇంకెంత మంది పోతారో" అని పారిజాతం శాపనార్థాలు పెడుతుంది. దీంతో దీప తీవ్రంగా స్పందిస్తుంది. తన బిడ్డ జోలికి వస్తే అంతు చూస్తానని, నిజం నిప్పులాంటిదని, తనను ఆట పట్టించాలని చూస్తే ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.
జ్యోత్స్న 'ప్లాన్ బి'..వైరాతో చీకటి ఒప్పందం!
ఎలాగైనా కంపెనీకి సీఈవో అవ్వాలని జ్యోత్స్న కుట్రలు చేస్తోంది. వైరాకు కాల్ చేసి నిజాలు ఎప్పటికీ బయటకు రాకూడదని, తన 'ప్లాన్ బి' అమలు చేయమని కోరుతుంది. తాను సీఈవో అవ్వగానే కంపెనీలో సగం షేర్లు ఇస్తానని వైరాకు ఎర వేస్తుంది. అటు కాశీని, ఇటు వైరాను వాడుకుని పని ముగిశాక వారిని కూడా వదిలించుకోవాలనే పక్కా స్కెచ్‌తో జ్యోత్స్న ముందుకు వెళ్తోంది.
ఆసుపత్రి పాలు చేసిన సుమిత్ర.. నోటి వెంట రక్తం!
సుమిత్ర ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. నోటి నుంచి రక్తం రావడంతో దీప కంగారు పడి కార్తీక్‌కు చెబుతుంది. కార్తీక్ సలహా మేరకు దశరథ సుమిత్రను ఆసుపత్రికి తీసుకెళ్తాడు. అయితే తనకేం కాలేదని మొండికేసిన సుమిత్రను.. దశరథ తనకే ఆరోగ్యం బాలేదని అబద్ధం చెప్పి హాస్పిటల్‌కు ఒప్పిస్తాడు. సుమిత్రకు వచ్చిన ఈ సమస్య కేవలం గొంతు పుండా? లేక మరేదైనా ప్రాణాంతక వ్యాధా? అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
అల్లుడు కాశీ ఇచ్చిన సాక్ష్యంతో శ్రీధర్ జైలు నుంచి బయటకు రావడం కష్టంగా మారింది. మరోవైపు సుమిత్ర ప్రాణాపాయంలో ఉంది. జ్యోత్స్న ఆడుతున్న ఈ రాజకీయాలు కార్తీక్ ఎలా అడ్డుకుంటాడు? శ్రీధర్ నిర్దోషి అని నిరూపించడానికి దీప ఏం చేయబోతోంది? రాబోయే ఎపిసోడ్లలో మరిన్ని ఉత్కంఠభరితమైన సీన్లు ఉండబోతున్నాయి.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications