Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Karthika deepam 2 November 19th: కార్తీక్ అడిగిన ప్రశ్నతో సుమిత్ర రహస్యం లీక్..?

కార్తీకదీపం 2 సీరియల్‌లో ఇన్నాళ్లూ ఇంటి వారసత్వం కోసం, దీపను అవమానించడం కోసం కార్తీక్‌తో తలపడిన జ్యోత్స్నకు ఊహించని షాక్ తగిలింది. శ్రీధర్ కుటుంబాన్ని హోమానికి పిలిపించడంలో కార్తీక్ గెలిచినా, జ్యోత్స్న ప్లాన్‌పై అతడు వేసిన ప్రశ్న ఆమె ఉనికినే ప్రశ్నించేలా చేయడంతో ఉత్కంఠ పెరిగింది.

శ్రీధర్ ఫ్యామిలీ ఓకే.. కావేరి షరతు!
గత ఎపిసోడ్‌లో శ్రీధర్‌ను అవమానించిన జ్యోత్స్న, పారిజాతంలు శివన్నారాయణ హెచ్చరికతో దిగొచ్చారు. శ్రీధర్ ఇంటికి వెళ్లి హోమానికి రావాలని బతిమాలుకోగా, అందుకు శ్రీధర్ ఒప్పుకున్నాడు. అయితే, "మా ఆవిడ కావేరి వస్తేనే వస్తాను" అని షరతు పెట్టాడు.తమ ఇంట్లోకి రాలేనని కావేరి మొరాయించడంతో, పారిజాతం జరిగిందంతా మరిచిపొమ్మని సారీ చెప్పింది. "నువ్వు మా అల్లుడి భార్యవి. నువ్వేమైనా పరాయిదానివా? శివన్నారాయణ గారి కోసమైనా రా" అని పారిజాతం బతిమా లడంతో కావేరి చివరకు హోమానికి రావడానికి ఒప్పుకుంది.

Karthika deepam 2 Serial November 19th Episode 519 Here is todays full story

కార్తీక్ VS జ్యోత్స్న: ఆ గొడవ ఎందుకని?
శ్రీధర్ ఇంటి నుంచి బయటకు వస్తున్న కార్తీక్‌కు దారిలో స్వప్న, కాశీలు గొడవపడుతూ కనిపించడంతో అతడు ఆలోచనలో పడతాడు. ఇంటికి వచ్చాక జ్యోత్స్నతో ఏకాంతంగా మాట్లాడతాడు. జ్యోత్స్న మొదలుపెట్టిన కొత్త గేమ్ ఆపేయమని కార్తీక్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అత్తామామల గొడవకు కారణం కూడా జ్యోత్స్నే అని ఆరోపిస్తాడు.

"రేపు జరగబోయే హోమం మన ఫ్యామిలీకి చాలా ముఖ్యం. దాన్ని నువ్వు చెడగొట్టాలని అనుకుంటున్నావు. నువ్వు చెడు చేయాలని చూసినా అవతలివాళ్లకు మంచే జరుగుతుంది, పోనీ ఓసారి మంచి చేయాలని ట్రై చేయ్ ఏం జరుగుతుందో చూద్దాం" అని కార్తీక్ సవాలు విసిరాడు.

ఆ షాకింగ్ ప్రశ్నతో జ్యోత్స్న ఉలిక్కిపాటు
అందుకు జ్యోత్స్న, "మా తాత, మా నాన్న, మా అమ్మలు నిన్ను గుడ్డిగా నమ్ముతున్నారు.. అందుకే నువ్వు అనుకున్నది జరుగుతుందని" అంటుంది. కార్తీక్ టాపిక్ డైవర్ట్ చేయవద్దని హెచ్చరిస్తూ, హోమం ఇంటి వారసురాలికి మంచి జరుగుతుందని చెప్పినప్పుడు నువ్వు సంతోషంగా ఉండొచ్చు కదా అని ప్రశ్నించాడు. "నువ్వేదో ఇంటి వారసురాలివి కాదన్నట్లుగా బిహేవ్ చేస్తున్నావు" అని కార్తీక్ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

"అంటే నేను సుమిత్ర కూతురిని కాదా?" అని జ్యోత్స్న ప్రశ్నించగా, "ఈ విషయం నేనేమీ అనలేదు.. నువ్వే అంటున్నావు" అని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న ఉలిక్కిపడుతుంది. "నువ్వు సుమిత్ర - దశరథల కూతురివి కాదా? నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదా?" అని కార్తీక్ తిరిగి ప్రశ్నించడం ఉత్కంఠను పెంచింది.

దొంగచాటుగా పారిజాతం.. శివన్నారాయణ మలుపు
కార్తీక్, జ్యోత్స్న మాట్లాడుకుంటున్న విషయాన్ని పారిజాతం దొంగచాటుగా వింటుండగా, శివన్నారాయణ ఆమెను గమనించి షాక్ ఇస్తాడు. పారిజాతాన్ని పిలిచి, "మీరిద్దరూ మాట్లాడుకుంటున్నది పాపం పారిజాతం ఇక్కడ నిలబడి వింటోంది. తనను మధ్యలో నిలబెట్టి మాట్లాడండి" అని అంటాడు. శ్రీధర్ ఫ్యామిలీని పిలిచావా అని శివన్నారాయణ అడగగా, రేపు వాళ్ల కుటుంబం అంతా వస్తున్నారని చెప్పడంతో పారిజాతాన్ని లోపలికి పంపిస్తాడు.

మరి, కార్తీక్ వేసిన ప్రశ్న వెనుక అసలు రహస్యం ఏంటి? జ్యోత్స్న వారసత్వంపై అనుమానాలు మొదలవడంతో, రేపటి ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+