Karthika deepam 2 November 22nd:దీపను లేపేసేందుకు స్కెచ్ వేసిందెవరు..?

కార్తీకదీపం 2 సీరియల్‌లో హోమంతో కుటుంబ కలయిక సంబరం కాస్తా, జ్యోత్స్న చర్యలతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గత ఎపిసోడ్‌లో కార్తీక్ వార్నింగ్‌తో జ్యోత్స్న కావేరి పాదాలకు పసుపు రాయడం, హోమంలో గురువుగారు చెప్పినట్లు వారసురాలు వేయాల్సిన పూర్ణాహుతి జ్యోత్స్న చేతి నుంచి జారి దీప చేతుల మీదుగా పడటం హైలైట్‌గా నిలిచింది. ఈ సంఘటన జ్యోత్స్న, పారిజాతాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

హోమం పూర్తి కాలేదంటూ జ్యోత్స్న అభ్యంతరం:

నేటి ఎపిసోడ్‌లో, అందరూ వెళ్లిపోయిన తర్వాత హోమం పూర్తి కాలేదంటూ జ్యోత్స్న శివన్నారాయణను అడ్డుకుంటుంది. "చివరికి వారసురాలి చేతుల మీదుగా పడాల్సిన పూర్ణాహుతి, ఈ ఇంటి పనిమనిషి చేతుల మీదుగా పడింది. ఇది అరిష్టం కాదా?" అని ప్రశ్నిస్తుంది. దీనిపై కార్తీక్ తీవ్రంగా స్పందిస్తూ, "నా భార్య కావాలనే వేసిందా? కింద పడకుండా పట్టుకునే ప్రయత్నంలో హోమంలో పడిందా?" అని నిలదీస్తాడు. జ్యోత్స్న తప్పు జరగకుండా చూడాలనుకున్న దీపను తప్పు పడుతోందని మండిపడతాడు. జ్యోత్స్న నోరు మూయమని పారిజాతం గద్దించగా, "నా కూతురి భర్తను అవమానిస్తే ఊరుకోను" అని కావేరి అడ్డుకుంటుంది.

Karthika deepam 2 Serial November 22nd Episode 522 Here is todays full story

శివన్నారాయణకు జ్యోత్స్న ప్రశ్న:

దీప చేసిన పనిని సమర్థిస్తున్నారే తప్ప, ఆమెపై ఒక్క మాట కూడా ఎవరూ అనలేదని జ్యోత్స్న ఫైర్ అవుతుంది. "అంటే నేను కావాలనే తప్పు చేశానా?" అని శివన్నారాయణను నిలదీయగా, "పూర్ణాహుతిని జాగ్రత్తగా పట్టుకోవాల్సిన బాధ్యత నీదే" అని సుమిత్ర అంటుంది. దీప ఎప్పుడూ నాకూ, అమ్మకూ మధ్య అడ్డుగోడగా ఉందని జ్యోత్స్న ఆవేదన వ్యక్తం చేస్తుంది. "లేదా లేని స్వతంత్రాన్ని తీసుకుని దీప పూర్ణాహుతిని హోమంలో వేసింది, ఇది మీ కంటికి కనిపించడం లేదా?" అని జ్యోత్స్న కోపంతో ప్రశ్నిస్తుంది.

గురువుగారు ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్:

పూర్ణాహుతి పనిమనిషి చేతిలో పడితే అరిష్టం కాదా అన్న జ్యోత్స్న ప్రశ్నకు గురువుగారు 'కాదు' అని సమాధానం చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. "భగవంతుడు ఎవ్వరినీ అనాథలుగా పుట్టించడు. అభం శుభం తెలియని పిల్లల్ని అనాథలుగా మనుషులే చేస్తున్నారు. ఈ దీపకు కూడా అమ్మానాన్నలు ఎక్కడో ఉంటారు. ఏదో ఒక రోజు ఆ భగవంతుడు అందరినీ కలుపుతాడు" అని గురువుగారు చెప్పడంతో జ్యోత్స్న భయంతో వణికిపోతుంది. పూర్ణాహుతి కింద పడకుండా ఆపినందుకు దీపను మెచ్చుకోవాలని గురువుగారు చెబుతారు. ఆగ్రహంతో జ్యోత్స్న దీపను తోసేయడంతో ఆమె స్పృహ కోల్పోతుంది.

దాసు కూతురే జ్యోత్స్న:పారిజాతం నిజం దాచే ప్రయత్నం

దీప స్పృహ కోల్పోవడంతో లోపలికి తీసుకెళ్లి పడుకోబెడతారు. ఎప్పుడూ గొడవలు చేస్తున్నందుకు పారిజాతం జ్యోత్స్నపై మండిపడుతుంది. "దీప చేతుల్లో పడితే నేను ఊరుకోనని" జ్యోత్స్న అనగా, పారిజాతం ఆగ్రహంతో "కానీ ఆ దీపే ఈ ఇంటి వారసురాలు" అని చెప్పబోయి ఆగిపోతుంది. దీప ఈ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి వారసురాలి స్థానాన్ని కోల్పోతానని జ్యోత్స్న భయపడుతుంది. "నువ్వు దాసు కూతురివని అందరికీ తెలియాలి, లేదా ఎక్కడో బతికున్న సుమిత్ర కూతురు రావాలి" అని పారిజాతం అంటుంది. దీప స్పృహలోకి వచ్చే వరకు ఎవరికీ కనిపించొద్దని జ్యోత్స్నను పారిజాతం బయటికి పంపిస్తుంది. చివరిగా, ప్రసాదం పెడుతూ, కాశీ-స్వప్నల మధ్య విభేదాలను గమనించిన కార్తీక్, కాశీకి కూడా ప్రసాదం పెట్టమని చెప్పడంతో స్వప్న పెట్టి వెళ్లిపోవడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+