Karthika deepam 2 October 21th Episode:జ్యోత్స్న ప్లాన్ రివర్స్ - సుమిత్ర జాడ పసిగట్టి..!!
భర్త మాటలకు మనస్తాపం చెంది ఇల్లు విడిచి వెళ్లిన సుమిత్ర, దెబ్బ తగలడంతో కార్తీక్ ఇంటికి చేరుకుంది. ఆమె తన కోసం దెబ్బతిన్నదని దీప గుర్తుచేయడంతో, కోడలు కాంచన, దీపల మాట కాదనలేక సుమిత్ర వారి ఇంట్లోనే ఉండేందుకు ఒప్పుకుంటుంది. మరోవైపు, సుమిత్ర ఎక్కడుందో కార్తీక్‌కు తెలుసని జ్యోత్స్న అనుమానిస్తుంది.
494వ ఎపిసోడ్ హైలైట్స్:
శౌర్యను విచారించిన జ్యోత్స్న:
జ్యోత్స్న, సుమిత్ర వాళ్ళ దగ్గరే ఉందన్న అనుమానంతో కార్తీక్ ఇంటికి వస్తుంది. "అత్తయ్య కనిపించకపోతే దీప, కార్తీక్‌లు ఇంత కూల్‌గా ఉండరు" అని తన అనుమానాన్ని పారుతో చెబుతుంది. దీప ఇంట్లో ఉన్న శౌర్య వద్ద సుమిత్ర వివరాలు తెలుసుకోవాలనుకుంటుంది. "నీ అమ్మమ్మ ఎక్కడుంది?" అని అడగ్గా, శౌర్య వెంటనే దీపను పెంచిన ఆమె ఫోటో చూపించి, "మా అమ్మమ్మ ఈవిడే" అని చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ముందుగానే శౌర్యకు ఇచ్చిన శిక్షణతో దీప తెలివిగా గట్టెక్కి సంతోషిస్తుంది.

మంత్రినే దాచేస్తారా?
జ్యోత్స్న బయటకు వెళుతున్నప్పుడు లోపల దగ్గిన శబ్దం వినడంతో అనుమానంతో గదిలోకి వెళ్తుంది. అయితే, సుమిత్ర కనిపించదు. సుమిత్ర ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుందని కార్తీక్ చెప్పిన విషయాన్ని గుర్తుచేసి, "మీ మమ్మీ తిరిగి రాకపోతే అందుకు కారణమైన వారిని వదిలిపెట్టను" అని జ్యోత్స్న హెచ్చరించి వెళ్లిపోతుంది.
సుమిత్ర మళ్లీ మాయం!
జ్యోత్స్న వెళ్లిపోగానే సుమిత్ర మంచంపై లేకపోవడంతో దీప, కాంచనలు కంగారుపడతారు. ఇంతలో సుమిత్ర కింద పడిపోయి ఉండటం చూసి అందరూ ఉలిక్కిపడతారు. సుమిత్ర ప్రవర్తనలో ఏదో తేడా ఉందని, కొత్తగా ఉందని కాంచన ఆందోళన చెందుతుంది. కార్తీక్ వచ్చాక ఒక నిర్ణయం తీసుకుందామని దీప అంటుంది.
సుమిత్ర కోసం దశరథ శపథం!
ఇంట్లో సుమిత్ర జ్ఞాపకాలతో బాధపడిన దశరథ్, "సుమిత్ర లేని ఈ ఇంట్లో ఉండలేను. నా భార్యను నేనే వెతుక్కుని, తిరిగి ఆమెతోనే ఇంట్లో అడుగుపెడతాను" అని శివన్నారాయణకు చెబుతాడు. భార్యపై ఉన్న తన ప్రేమను చాటుకుంటాడు.సుమిత్ర ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుందని కార్తీక్ చెప్పిన మాటపైనే జ్యోత్స్న అనుమానం ఉంది. మరి సుమిత్రకు ఏం జరిగింది? ఆమె ఆరోగ్యం ఎలా ఉంది? తదుపరి ఎపిసోడ్‌లో చూడాలి.












Click it and Unblock the Notifications