KCR: ‘తెలంగాణ తేజం’ పాటను ఆవిష్కరించిన కేసీఆర్
హైదరాబాద్: సినీ నటుడు, జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్ హీరోగా తెరకెక్కిన కేసీఆర్ (కేశవ చంద్ర రమావత్ ) సినిమాలోని తెలంగాణ తేజం పాటను మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి ఈ సినిమా హీరో, నిర్మాత రాకింగ్ రాకేశ్ శుక్రవారం వెళ్లి ఆయనను కలుసుకున్నారు.
రాకింగ్ రాకేశ్‌తోపాటు, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, జోర్దార్ సుజాత, సింగర్లు విహ, గీత, రచయిత సంజయ్ మహేశ్‌లు కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలుగు తేజం పాటను కేసీఆర్ ఆవిష్కరించారు. చిత్ర బృందానికి కేసీఆర్ అభినందనలు తెలిపారు.

ఈ గీతా ఆవిష్కరణ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు దామోదర్‌రావు, బీఆర్‌ఎస్ నేతలు బోయిన్‌పల్లి వినోద్ కుమార్, సంతోశ్ కుమార్, మధుసుధనచారి, దేశపతి శ్రీనివాస్, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.
కాగా, ఇటీవ కాలంలో జబర్ధస్‌లో నటించి మంచి పేరు తెచ్చుకున్న వారంతా సినిమాల్లోకి అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు హీరోలుగా, మరికొందరు హాస్యనటులుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ పలు సినిమాల్లో హీరోగా నటించగా.. తాజాగా, గెటప్ శ్రీను చిత్రంలో హీరోగా నటించారు. చమ్మక్ చంద్ర, ఆది, రాంప్రసాద్, రచ్చ రవి తదితరులు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications