ప్రభాస్‌తో మూవీని వద్దనుకున్న.. కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్..!

హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తెలిసి మాట్లాడుతున్నారో ,తెలియక మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఆమె ఏం మాట్లాడిన వివాదంగానే మారుతోంది. మెగాస్టార్ చిరంజీవి మీద కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ ప్రస్తుతం ''రఘుతాత'' అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు కీర్తి సురేష్.

చిరంజీవి, తమిళ స్టార్ హీరో విజయ్ వీరిద్దరిలో మీరు ఎవరికి ఓటు వేస్తారని యాంకర్ కీర్తి సురేష్‌ను ప్రశ్నించగా, ఆమె ఏమాత్రం ఆలోచించుకుండా విజయ్‌ పేరు చెప్పడం జరిగింది. దీంతో ఆమెపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. చిరంజీవి వంటి గొప్ప నటుడును , విజయ్‌తో పోలుస్తారా అంటూ ఆమెపై మండిపడ్డారు. ఈ వివాదం ముగిసిందనుకునేలోపే ఆమె మరో వివాదానికి తెర లేపారు.

keerthy suresh rejected prabhas kalki movie

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం వచ్చిన చేయనని చెప్పానని కీర్తి సురేష్ తెలిపి పెద్ద సంచలనానికి తెరలేపారు. తాజా ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ .. కల్కి 2898 ఏడీ మూవీలో ఓ రోల్ కోసం డైరెక్టర్ నాగ్ అశ్విన్ నాకు కాల్ చేశారు. కానీ ఆ పాత్ర నేను చేయలేను అని సున్నితంగా తిరస్కరించాను. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు లో భాగం కావాలని ఉంది అని నాగ్ అశ్విన్‌కి మెసేజ్ చేశాను. అప్పుడు నాగ్ అశ్విన్ బుజ్జికి వాయిస్ ఓవ‌ర్ అందించే ఛాన్స్‌ను త‌న‌కు ఇచ్చార‌ని కీర్తి సురేష్ తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది.

బుజ్జికి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చినందుకు తాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాన‌ని.. కల్కి పార్ట్‌ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాన‌ని తెలిపింది. అయితే క‌ల్కిలో తాను రిజెక్ట్ చేసిన పాత్ర ఏది అనేది మాత్రం చెప్ప‌న‌ని కీర్తి సురేష్ తేల్చేసింది. కాగా, సినిమా స్టార్టింగ్ లో దివ్య అనే గ‌ర్భిణీ పాత్ర‌లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ న‌టించింది. ఆ పాత్ర‌నే కీర్తి సురేష్ రిజెక్ట్ చేసి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+