చిరంజీవిని ఘోరంగా అవమానించిన కీర్తి సురేష్
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఇండస్ట్రీకి చెందిన హీరోల కొడుకులు వారసులుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారిని దాటుకుని మరీ నెంబర్ వన్ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్లపాటు తెలుగులో టాప్ హీరోగా చిరంజీవి నిలిచారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకనొక సమయంలో దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా చిరంజీవి నిలిచారు. పొలిటికల్‌గా ఫ్లాప్ కావడంతో చిరంజీవి తిరిగి సినిమాల్లో నటించారు.
10 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాల్లో నటించినప్పటికి ఆయన క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. అలాంటి మెగాస్టార్ మీద కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. కీర్తి సురేష్ ప్రస్తుతం ''రఘుతాత'' అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు కీర్తి సురేష్. చిరంజీవి, తమిళ స్టార్ హీరో విజయ్ వీరిద్దరిలో మీరు ఎవరికి ఓటు వేస్తారని యాంకర్ కీర్తి సురేష్‌ను ప్రశ్నించగా, ఆమె ఏమాత్రం ఆలోచించుకుండా విజయ్ పేరు చెప్పడం జరిగింది.

దీంతో ఆమెపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. చిరంజీవి వంటి గొప్ప నటుడును , విజయ్‌తో పోలుస్తారా అంటూ ఆమెపై మండిపడ్డారు. కీర్తి సురేష్‌ను స్టార్ హీరోయిన్‌ను చేసింది తెలుగు ఇండస్ట్రీ అని మెగా అభిమానులు చెబుతున్నారు. ''మహానటి'' సినిమాతో ఆమెకు గుర్తింపు దక్కిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటిది తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని జాతీయస్థాయికి తీసుకువెళ్లిన హీరోను కాదని, విజయ్‌కు ఆమె ఓటు వేయడాన్ని మెగా అభిమానులు తప్పుపడుతున్నారు.
ఇక కీర్తి సురేష్ కెరీర్ విషయానికి వస్తే..ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ఇటీవల సోషల్ మీడియాలో కూడా కీర్తి సురేష్ తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇటీవల వరుసగా హాట్ ఫొటోషూట్‌లతో రెచ్చిపోతుంది.












Click it and Unblock the Notifications