మహేష్ బాబు వాయిస్ దారుణంగా ఉంది- స్టార్ హీరోయిన్
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు వంటి సూపర్ హిట్లతో ఆగ్ర స్థానానికి చేరువయ్యారాయన. సంక్రాంతికి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు తన లుక్‌ను మొత్తం మార్చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ మహేష్ బాబు వాయిస్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. మహేష్ బాబు గొంతు గురించి కామెంట్స్ చేసింది మరెవ్వరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ. మహేష్ బాబుతో కలిసి ఈ అమ్మడు భరత్ అనే నేను సినిమాలో నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకు ముందు మహేష్ బాబు నటించిన పలు సినిమాలను హిందీ డబ్బింగ్‌లో చేశారట. కానీ మహేష్ బాబు లుక్‌కి ఆ డబ్బింగ్‌కి ఏమాత్రం సెట్ అయ్యేది కాదట.

దీనిపై కియారా అద్వానీ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..మహేష్ బాబు ఇంత అందంగా ఉన్నారు. కానీ ఆయన వాయిస్ ఏంటి ఇంత దారుణంగా ఉంది. ఆయన బాడీకి.. డబ్బింగ్ మూవీస్ లో వచ్చిన వాయిస్ కి ఏమాత్రం సంబంధం లేదు. మహేష్ బాబు గొంతు ఇంత దారుణంగా ఉంటుందా అని ఆశ్చర్యపోయా అని కియారా తెలిపింది. కానీ రియల్‌గా మీట్ అయినప్పుడు ఆయన వాయిస్ అందానికి తగ్గట్లుగా చాలా బాగుందనిపించిందని పేర్కొంది. దీనిపై మహేష్ బాబు మాట్లాడుతూ కియారా నా డబ్బింగ్ సినిమాల గురించి చెబుతుంటే నాకే సిగ్గుగా అనిపించింది. డబ్బింగ్ సినిమాల్లో వాయిస్ చిత్ర విచిత్రంగా ఉంటుంది అని మహేష్ తెలిపారు. కియారా అద్వానీ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది. డిసెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications