కింగ్ కొత్త యాడ్ చూశారా..? ఈ ఫీల్డ్‌లో నిన్ను కొట్టేవాడే లేడు

కింగ్ నాగార్జున వయసు పెరుగుతున్న కొద్దీ యంగ్ గా మారుతున్నారు. ఇటీవలి కాలంలో హీరో, విలన్ తేడా లేకుండా వచ్చిన ప్రతి క్యారెక్టర్ ను కుమ్మి పడేస్తున్నారు. మొన్న కుబేర లో తన విలక్షణమైన నటనతో కట్టిపడేశారు కింగ్. ఇక తాజాగా లోకేష్ కనకరాజ్- రజనీకాంత్ కాంబోలో వస్తున్న కూలీ చిత్రంలో తొలిసారి ఫుల్ లెంగ్త్ విలన్ క్యారెక్టర్ చేశారు. ఈ మూవీ ఆగస్టు 14 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఇక తాజాగా అక్కినేని కుటుంబానికి ప్రత్యేకమైన చిత్రం 'మనం' జపాన్‌ లో విడుదలైన విషయం తెలిసిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కింది.

అయితే కింగ్ నాగార్జున తాజాగా ఓ యాడ్ షూట్‌లో నటించారు. పక్కన ఓ హీరోయిన్‌ను కూర్చొబెట్టుకుని నాగ్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ యాడ్ చూసిన తర్వాత నెటిజన్లు తమదైనశైలిలో రియాక్ట్ అవుతున్నారు.

వయస్సు పెరిగినా నాగ్‌లో జోష్ ఏమాత్రం తగ్గలేదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అలాగే 60 ఏళ్ల బామ్మ నుంచి 18 ఏళ్ల అమ్మాయి వరకు అందర్నీ కట్టిపడసే అందం నాగార్జునదని మరోొ నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే..నాగ్ తన వయస్సు తగ్గ పాత్రలతో అభిమానులతో పాటు, ప్రేక్షకులను కూడా మెప్పిస్తున్నారు. ఇటీవలే కుబేర సినిమాలో కీలక పాత్రలో కనపించి మెప్పించిన నాగ్, ఇప్పుడు విలన్‌గా తన నట విశ్వరూపాన్ని చూపించడానికి రెడీ అవుతున్నారు.

King Nagarjuna s Latest Ad Shoot Goes Viral

నాగార్జున ఫిట్ నెస్ గురించి ఇటీవల కూలీ మూవీ ఆడియో ఫంక్షన్ లో రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీలో నాగార్జున చేస్తున్న సైమన్ పాత్ర చాలా స్టైలిష్ గా ఉంటుందని అన్నారు. నాగ్​ తాను కలిసి 33 ఏళ్ల కిందట ఓ సినిమా చేశామని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఒకేలా ఉన్నారన్నారు. 'నాకు ఇప్పుడు జట్టు ఊడిపోయింది. నాగ్ ​తో కలిసి పనిచేస్తుండగా మీ ఆరోగ్య రహస్యం ఏంటని ఆయన్ని అడిగాను. దానికి వ్యాయామం, స్విమ్మింగ్, డైట్​ ఫాలో అవడం అని చెప్పారు అని రజనీకాంత్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+