'దేవర'ను రెండు భాగాలుగా తీయడం ఇష్టం లేదు - కొరటాల సంచలన కామెంట్స్
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్నతరుణం రానే వచ్చింది. దాదాపు ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే విడుదలైన తొలిరోజునే ఈ సినిమా మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన ప్రేక్షకులు 'దేవర'పై పెదవి విరుస్తున్నారు. ఫస్ట్ హాఫ్ సూపర్‌గా ఉందని చెబుతోన్న అభిమానులు, సెకాండాఫ్‌కు వచ్చే సరికి నీరసం వచ్చేసిందని చెబుతున్నారు. అయితే మెజార్టీ అభిమానులు ఓవరాల్‌గా సినిమా బాగుందని రిపోర్ట్ ఇస్తున్నారు.
మరోవైపు బాక్సాఫీస్ వద్ద 'దేవర' మొదటి రోజు కుమ్మేసింది. మొదటి రోజు దేవరకు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అఫిషియల్‌గా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇండియాలో అన్ని భాషలలో కలిపి దాదాపు రూ.77 కోట్లు నెట్ అందుకున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూలు చేసింది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిన్న ఒక్కరోజే రూ.68.6 కోట్లు కలెక్షన్స్ వచ్చాయట. ఇతర భాషలలో హిందీలో రూ.7 కోట్లు, కన్నడలో రూ.0.3 కోట్లు, తమిళంలో రూ.0.8 కోట్లు, మలయాళంలో రూ.0.3 కోట్లు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి.

యూఎస్‌లో సైతం దేవరకు పాజిటివ్ రెస్పన్స్ లభిస్తోంది. సినిమా ఫలితంపై దర్శకుడు కొరటాల శివ సైతం హ్యాపీగా ఉన్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కొరటాల మాట్లాడుతూ .. ప్రస్తుతం పార్ట్1 పార్ట్ 2 సినిమాలు వస్తున్నాయి కదా అని ఈ సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించలేదని ఆయన తెలిపారు. రెండు పార్టులుగా తీయాలనే ఆలోచన నాకు, ఎన్టీఆర్‌కు లేదని కానీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత ఇది రెండు, మూడు గంటల్లో చెప్పే కథ కాదని డిసైడ్ అయిన తర్వాతే సినిమాను రెండు భాగలుగా తీయాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం కొరటాల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications