ఆ పని చేయలేక ఏడ్చేశాను..స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న హీరోయిన్ల పేర్లలో కృతి సనన్ కూడా ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాతో కృతి సనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. ఆ తర్వాత నాగ చైతన్యతో 'దోచేయ్' సినిమా ఫలితం కూడా కృతి సనన్‌ను నిరాశ పర్చింది.
దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్‌కు మకాం మార్చింది. తెలుగులో ఫ్లాప్ హీరోయిన్‌గా ముద్ర తెచ్చుకున్న కృతి సనన్, బాలీవుడ్‌లో మాత్రం బాలీవుడ్ మాత్రం సత్తా చాటారు. బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో సీతగా కనిపించి అభిమానులను అలరించింది. కృతి సనన్ లండన్‌కు చెందిన ఓ కోటీశ్వరుడి కొడుకు కబీర్ బహియా అనే వ్యక్తితో కృతి సనన్ డేటింగ్ చేస్తోంది.

వీరిద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటోలు కూడా బయటకు రావడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని అందరికి అర్థం అయింది. త్వరలోనే కృతి సనన్ కబీర్ బహియాను వివాహం చేసుకోవడానికి కూడా సిద్ధమవుతుందని తెలుస్తోంది. ప్రియుడు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రియుడు పుట్టిన రోజు వేడుకల్లో అమ్మడు సందడి చేసింది. ఇదిలా ఉంటే కృతి సనన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కృతి సనన్ తాజాగా నటించి , నిర్మించిన చిత్రం 'దో పత్తి'. నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
నిర్మాతగా తొలి సినిమాతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది అమ్మడు. తాజాగా ఇంటర్య్వూలో పాల్గొన్న కృతి సనన్ సినిమా ప్రమోషన్స్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రచారంలో పాల్గొనడం చాలా కష్టమైన పని అని వెల్లడించింది. 'భేడియా' మూవీ కోసం ప్రమోషన్స్‌లో పాల్గొనలేక ఏడ్చానంటూ చెప్పుకొచ్చింది. 'దో పత్తి' సినిమా కోసం వరుస ఇంటర్య్వూలు, రియాల్టీ షోలకు హాజరయ్యానని ఈ భామ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications