దళపతి విజయ్, ఎంఎస్ ధోనీ లను ఆ విషయంలో దాటేసిన లేడి పవర్ స్టార్
టాలీవుడ్ ప్రేక్షకులకు లేడి పవర్ స్టార్ సాయి పల్లవి.. ఈమె గురించి పరిచయం అక్కర్లేదు. మలయాళం లో సూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులను తన నటనతో మరో స్థాయిలో ఫిదా చేసిన సాయి పల్లవి.. ఆపై పలు పలువురు స్టార్ హీరోల సరసన నటించి ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను కట్టిపడేసిన ఈ భామ పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.
అలానే సోషల్ మీడియాలో కూడా ఈ భామకు విపరీతమైన క్రేజ్ ఉంది. దళపతి విజయ్, మహేంద్రసింగ్ ధోని లాంటి సెలబ్రిటీలను కూడా ఇప్పుడు వెనక్కి నెట్టేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇక దేశవ్యాప్తంగా తమిళ్ స్టార్ హీరో విజయ్ కి సంబంధించి 20 శాతం.. ఎంఎస్ ధోనీకి సంబంధించి 17 శాతం మంది తెలుసుకోవాలని ఆశకరి చూపిస్తున్నారు. కానీ 25 శాతం మంది ఇన్ స్టాగ్రామ్ లో సాయి పల్లవికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది . ఈ లెక్కన చూస్తే ఇండియా మొత్తం జనాభాలో 25 శాతం మందిని సాయి పల్లవి ప్రభావితం చేస్తోందని టాక్ నడుస్తోంది.

ఇప్పటివరకు ఏ హీరోయిన్ కూడా ఇలాంటి ఘనత అందుకోలేదని.. ఈ రికార్డు కేవలం సాయి పల్లవికి మాత్రమే దక్కిందని ఆమె అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఇక మిగిలిన సెలబ్రిటీలలో చాలామంది ఐదు శాతం వరకు జనాలను ప్రభావితం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ లెక్కలు చూసుకుంటే దేశవ్యాప్తంగా సాయి పల్లవికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని చర్చ జరుగుతోంది.
రీసెంట్ గానే శివకార్తికేయన్‌కు జంటగా అమరన్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలానే నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులు ఎదురుచూస్తూ ఉండగా ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ వదలకపోవడం గమనార్హం.
మరోవైపు స్క్రిప్ట్ సెలక్షన్ లో చాలా ఆచితూచి అడుగులు వేసే ఈ భామ.. కథ, అందులో తన పాత్ర నచ్చితేనే నటించడానికి పచ్చజెండా ఊపుతారు. అలాంటి పాత్రల్లోనే నటిస్తూ వరుస విజయాలను అందుకుంటున్నారు.












Click it and Unblock the Notifications