మెగా కోడలు గుడ్ న్యూస్.. సెకండ్ బేబీ కమింగ్ సూన్..!
ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి మర్చిపోలేనిదిగా భావించవచ్చు. మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవర ప్రసాద్ గారు' మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో పాటు గ్లోబర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించడం.. ఈ రెండు ఘటనలు అటు మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కు ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాలు. అయితే ఈ సమ్మర్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రాబోతోంది. మార్చి 26 న గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.
అయితే ఇప్పుడు అంతకుమించిన ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. మెగా కపుల్ గా పిలుచుకునే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిలు సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి తెలిపారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే.. ఇటీవల ఈ దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. బాబు పేరు వాయువ్ తేజ్ అని పెట్టారు. అయితే ఇటీవల ఓ షోలో పాల్గొన్న లావణ్య త్రిపాఠి.. సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి ఓపెన్ అయ్యారు.
నటి లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సతీ లీలావతి చిత్రం ప్రొమోషన్లలో ఫుల్ బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావటం విశేషం. ఈ మూవీ మార్చి 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే లావణ్య త్రిపాఠి తన మూవీ టీమ్ తో కలిసి యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో లావణ్య త్రిపాఠి తన వ్యక్తిగత విషయాలు గురించి పంచుకున్నారు.
ఇంట్లో వాయవ్ తేజ్ మొదటి మొదటి వారసుడు కావడంతో వాడిని ఆడించడం కోసం ఇంట్లో అత్తయ్య మామయ్యతో పాటు నిహారిక కూడా బాగా పోటీ పడతారని తెలిపారు. అప్పుడు సుమ ఇప్పుడే ఇలాగ ఉంటే మున్ముందు ఇంకా కాంపిటీషన్ పెరిగిపోతుందని అనడంతో.. అప్పుడు లావణ్య త్రిపాఠి.. అప్పటికి సెకండ్ బేబీ కూడా వస్తారు కదా.. అప్పుడు కాంపిటీషన్ తగ్గుతుందని తెలిపింది. దాంతో ఆమె వ్యాఖ్యలకు ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ , ఉపాసన కపుల్స్ కు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు జన్మించారు.

ఇక 2023 లో వరుణ్ తేజ్ ను వివాహం చేసుకున్న లావణ్య త్రిపాఠి, ఆ తర్వాత 'టన్నెల్' అనే తమిళ సినిమాలో నటించారు. 2024లో 'మిస్ పర్ఫెక్ట్' అనే వెబ్ సిరీస్ చేసిన లావణ్య త్రిపాఠి, 'సతీ లీలావతి'మూవీతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications