ప్లాఫ్ టాక్ తోనూ దిమ్మతిరిగే కలెక్షన్లు.. అన్న స్టార్ హీరో అయ్యాడ్రోయ్..!
సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది ఎంట్రీ ఇస్తుంటారు. తమ టాలెంట్ ను ప్రదర్శిస్తుంటారు కానీ రెండు మూడు సినిమాలు చేసి వెళ్లిపోయేవాళ్లు కొంత మంది.. తమ కృషితో ఆటుపోట్లను తట్టుకుని నిలబడి అగ్రస్థానానికి చేరుకునే వారు మరికొంతమంది. అలాంటి వారిలో తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ ఆయన చేసిన సినిమాలు మూడు మాత్రమే.. కానీ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాయి. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ ఇలా వరుసగా ఒకదాన్ని మించిన మరొకటి సినిమాల్ని దించాడు ప్రదీప్ రంగనాథన్.. అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాల్ని అందుకున్నాయి.
ఇక తాజాగా ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా LIK.. ఈ మూవీ ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 10 న విడుదలైంది. LIK మూవీలో ప్రదీప్ రంగనాథన్ సరసన ఉప్పెన మూవీ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక ఎస్. జే . సూర్య కీలక పాత్రలో నటించారు. ఈ మూవీని విజ్ఞేన్ శివన్ తెరకెక్కించారు. అలాగే ఈ మూవీలో యోగిబాబు, సీమాన్, గౌరీ కిషన్, షారా, మాళవిక కీలక పాత్రల్లో నటించారు. LIK మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. ఇక నయనతార, లలిత్ కుమార్ , ఎల్ కే విష్ణు కుమార్ సంయుక్తంగా నిర్మించారు.
ప్రదీప్ రంగనాథన్ వరుసగా మూడు హిట్లు కొట్టి బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. దాంతో ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన LIK మూవీ మొదటిరోజు తొలి ఆట నుంచే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే అప్పటికే ప్రదీప్ రంగనాథన్ కు యూత్ లో ఉన్న ఫుల్ క్రేజ్, బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్, బ్రాండ్ ఇమేజ్ కారణంగా ఈ మూవీ రిలీజైన 10 రోజుల్లోనే దాదాపు 90 శాతం రికవరీని సొంతం చేసుకోవడం విశేషం. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్నే ప్లాఫ్ టాక్ రాగానే పక్కన పెట్టేస్తున్న రోజులివి. ఈ సమయంలో ప్రదీప్ రంగనాథన్ ప్లాఫ్ టాక్ తో కలెక్షన్స్ రాబడుతున్నాడంటే ఆయనపై ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం అవుతోంది.

LIK మూవీకి ఒక్క తమిళనాడు నుండే దాదాపు రూ. 29 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సమాచారం. అలాగే తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి రూ. 10 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు నమోదైనట్లు సమాచారం. ఇక ఓవరాల్ గా చూస్తే 10 రోజుల్లో ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ. 58 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూల్లు అలాగే రూ. 32.5 కోట్ల రూపాయిల షేర్ వసూల్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications