ప్రేక్షకుల ముందుకు దమ్మున్న సినిమా

అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు,పల్లంకొండ శ్రీరాములు సంయుక్తంగా నిర్మించిన సినిమా 'మా రాముడు అందరివాడు'. యద్ధనపూడి మైకిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించారు. సీనియర్ నటుడు సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు, గోల్డ్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి, దర్శకుడు శ్రీనివాస తేజ చిత్రా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

'ఇరుముడి' జనరేషనల్ బ్లాక్ బస్టర్.. రూ. 200 కోట్ల పోస్టర్ తో స్పెషల్ సర్ ప్రైజ్
'ఇరుముడి' జనరేషనల్ బ్లాక్ బస్టర్.. రూ. 200 కోట్ల పోస్టర్ తో స్పెషల్ సర్ ప్రైజ్

టాలెంట్‌కు పట్టం గట్టే సినిమా: సీనియర్ నటుడు సుమన్
సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ కంటే ప్రతిభే ముఖ్యమని సీనియర్ నటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో హీరో శ్రీరామ్ ద్విపాత్రాభినయంలో అద్భుతమైన నటన కనబరిచారని కొనియాడారు. తాను ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా ఓ మంచి సామాజిక సందేశాన్ని ఇచ్చే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. ఆసక్తికరమైన మలుపులతో సాగే ఈ కథ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని.. ఇలాంటి సినిమాలను ఆదరించడం ద్వారా ఇండస్ట్రీకి మరింత మంది కొత్త నటీనటులు, నిర్మాతలు వస్తారని అన్నారు.

Maa Ramudu Andarivadu Pre Release Event Senior Actor Suman Sriram and Team Share Highlights Full Details

200కి పైగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్-నిర్మాత లక్ష్మణరావు
ఈ సినిమా అవుట్‌పుట్ చాలా అద్భుతంగా వచ్చిందని నిర్మాత అనుముల లక్ష్మణరావు సంతోషం వ్యక్తం చేశారు. నిర్మాణ బాధ్యతలతో పాటు ఈ సినిమాలో 20 ఏళ్లుగా ఊరిని తన అరాచకాలతో కంట్రోల్ చేసే వైల్డ్ విలన్ పాత్రను కూడా తానే పోషించినట్లు వెల్లడించారు. మారేడుమిల్లి ఫారెస్ట్ అందాలతో విజువల్స్ అద్భుతంగా వచ్చాయని.. మనీష్ కుమార్ స్వరపరిచిన నాలుగు పాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని వెల్లడించారు. సెప్టెంబర్ 4న 200కు పైగా థియేటర్లలో వస్తోందని వెల్లడించారు.

Romanchakam First Review: రోమాంచకం మూవీ ఫస్ట్ రివ్యూ.. హిట్టా..? ఫట్టా..?
Romanchakam First Review: రోమాంచకం మూవీ ఫస్ట్ రివ్యూ.. హిట్టా..? ఫట్టా..?

ఎమోషనల్ ఫుల్ మీల్స్- డైరెక్టర్ యద్ధనపూడి మైకిల్
దాదాపు 14 నెలల పాటు అనేక అవాంతరాలను దాటుకుని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని డైరెక్టర్ యద్ధనపూడి మైకిల్ తెలిపారు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు కథ, మాటలు, పాటలు, రెండు పాట కొరియోగ్రఫీ బాధ్యతలను కూడా తానే నిర్వహించినట్లు చెప్పారు. తండ్రీకొడుకుల మధ్య సాగే బలమైన ఎమోషన్ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుందని.. ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ ఫుల్ మీల్స్ వంటి అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

దమ్మున్న కంటెంట్‌తో వస్తున్నాం:
చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా కంటెంట్ ను చూసి ఆదరించాలని హీరో శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. మనల్ని మనం ప్రోత్సహించుకున్నప్పడే ప్రతిభను నిరూపించుకోగలమని అన్నారు. ఈ సినిమాలో మంచి దమ్ము ఉందని.. సుమన్ వంటి సీనియర్ నటుడితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవమని చెప్పారు. ఇండస్ట్రీలో వంద సినిమాలు చేయడమే తన లక్ష్యమని.. ఈ సినిమా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+