మహేష్ బాబుతో సినిమా చేయడమే నేను చేసిన అతి పెద్ద తప్పు
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు వంటి సూపర్ హిట్లతో ఆగ్ర స్థానానికి చేరువయ్యారాయన. సంక్రాంతికి మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.
మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నారు. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు తన లుక్‌ను మొత్తం మార్చేశారు. గడ్డం, జుట్టు ఫుల్‌గా పెంచేసి కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఏ దర్శకుడైనా మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో సినిమా చేయాలని కలలు కంటారు. కానీ ఓ దర్శకుడు మహేష్ బాబుతో మూడు సినిమాలు చేశారు. ఆ దర్శకుడు మరెవరో కాదు.. గుణశేఖర్. మహేష్ బాబుతో గుణ శేఖర్ ఏకంగా మూడు సినిమాలను తెరెక్కించారు.

'ఒక్కడు', 'సైనికుడు', 'అర్జున్' సినిమాలను మహేష్ బాబుతో తీశారు గుణ శేఖర్. అయితే ఈ మూడు సినిమాల్లో 'ఒక్కడు' మాత్రమే హిట్‌గా నిలిచింది. అర్జున్ యావరేజ్‌గా నిలవగా, సైనికుడు సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. 'ఒక్కడు' సినిమా అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇటీవల దర్శకుడు గుణ శేఖర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..మహేష్ బాబుతో వరుసగా మూడు సినిమాలు చేయడమే తాను చేసిన అతి పెద్ద తప్పుగా ఆయన అభివర్ణించారు.
మహేష్ బాబు మత్తులాంటి వాడని, అతనితో కలిసి పని చేస్తే ఆయన మాయలో పడపోతామని, అందుకే వరుసగా మూడు సినిమాలు మహేష్‌తోనే చేశానని గుణ శేఖర్ తెలిపారు. మహేష్ దర్శకులకు తన నటనతో సవాల్ విసురుతారని, మనం 100 శాతం ఇవ్వమంటే ఆయన 200 శాతం ఇస్తారని , అందుకే అతనితో మూడు సినిమాలు చేశానని గుణ శేఖర్ చెప్పుకొచ్చారు. అలా వరుసగా కాకుండా మరో హీరోతో సినిమాలు చేసి మహేష్‌తో చేసి ఉంటే వీటి ఫలితాలు వేరేలా ఉండేవని గుణ శేఖర్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications