సామి దర్శనం: రుద్ర వచ్చేశాడు.. పాన్ వరల్డ్ లుక్స్ లో గూస్ బంప్స్

నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే. ఈ సందర్భంగా రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం వారణాసి నుంచి మహేష్ బాబు స్టిల్స్ విడుదల అయ్యాయి. పాన్ వరల్డ్ లెవెల్ లో చిత్రీకరణ జరుపుకొంటోందీ మూవీపై హై ఎక్స్ పెక్టేషన్స్ తగ్గట్టుగానే మాస్ అండ్ రగ్డ్ లుక్స్ లో కనిపించాడు మహేష్ బాబు. గత ఏడాది నవంబర్ లో రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్లెస్ ఈ సినిమాపై అంచనాలను ఆకాశానికి పెంచేశాయి.

రుద్రగా గతంలో ఎప్పుడూ చేయని రోల్ లో మెరుపులు మెరిపించబోతోన్నాడు మహేష్ బాబు. ప్రియాంక చోప్రా, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ది ఇందులో కీ రోల్. ఎంఎం కీరవాణి సంగీతం, వీ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తోన్నారు. 2027 ఏప్రిల్ 7వ తేదీన విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని వారణాసి యూనిట్ ఇదివరకే అధికారికంగా వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి/ఫిబ్రవరి నాటికి షూటింగ్ పూర్తి కావొచ్చు.

Mahesh Babu Birthday Surprise Rudhra Stills Released from Varanasi instead of a separate update

విజువల్ వండర్ గా తెరకెక్కుతోందీ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్. సినిమా మొత్తానికీ హైలైట్.. రామాయణం ఎపిసోడ్. అత్యంత సవాల్ తో కూడుకున్నది కూడా. దీన్ని అదే లెవెల్ లో తీసుకెళ్తోన్నారు మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌలి. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలకు మెక్సికోలో శ్రీకారం చుట్టారు. మెక్సికో సిటీలోని ప్రఖ్యాత CCXP Mexico 2026లో ప్రివ్యూ సైతం వేశారు.

Mahesh Babu Birthday Surprise Rudhra Stills Released from Varanasi instead of a separate update

మహేష్ బర్త్ డే సందర్భంగా ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం నుంచి వీడియో గ్లింప్స్ ఆశించారు గానీ అది సాధ్యపడలేదు. దీనికి బదులుగా మేకర్స్ ఊహించని విధంగా ఈ రెండు స్టిల్స్ విడుదల చేసి సర్ ప్రైజ్ చేశారు. ఆఫ్రికాలోని ప్రఖ్యాత కిలిమంజారో పర్వతాలు, మాసాయి మారా అడవుల నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా విడుదలైన స్టిల్స్ అక్కడ చిత్రీకరించినవే.

అక్కడి లొకేషన్ల ల్యాండ్‌స్కేప్ ను కెమెరాలో బంధించడానికి ఐమాక్స్ ఫ్రేమ్ కూడా సరిపోలేదంటూ రాజమౌళి వ్యాఖ్యానించారు. ఈ విజువల్స్ వెండితెరపై ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తోన్నారు. ప్రస్తుతానికి ఈ చిత్ర అప్‌డేట్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు. ఎస్ఎస్ కార్తికేయ సమర్పకుడిగా వ్యవహరిస్తోన్నారు.

కరికాల ఛాప్టర్ 1.. తెలుగు తెరపై మరో మిస్టిక్, మైథలాజికల్ థ్రిల్లర్.. !!
కరికాల ఛాప్టర్ 1.. తెలుగు తెరపై మరో మిస్టిక్, మైథలాజికల్ థ్రిల్లర్.. !!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+