మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా కలకలం.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో కరోనా కలకలం రేపుతోంది. మహేశ్ బాబు సతీమణి నమ్రతా అక్క శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్ తేలినట్లు ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని మహేశ్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో అందరికీ తెలిసిందే. షూటింగ్స్ లో కొంచెం గ్యాప్ దొరికినా ఆయన మొత్తం ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. అయితే ఇప్పుడు మహేశ్ ఫ్యామిలీలో కరోనా కలకలం రేపుతోంది. మహేశ్ సతీమణి నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ కొవిడ్ బారిన పడినట్లు తెలిపారు.
హెల్లో ఫ్రెండ్స్ .. నేను కరోనా బారిన పడ్డాను. మీరు సురక్షితంగా ఉండండి. మాస్కులు ధరించండి. అని ఆమె పోస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా మహేశ్ అభిమానులు కంగుతిన్నారు.
ఆమె త్వరగా కోలుకోవాలని మహేశ్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications