పవన్ కల్యాణ్‌పై మహేష్ బాబు సోదరి కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెంట్రర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా మారారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ ..వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలోనే రాబోవు ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది.
వైసీపీపై వ్యతిరేకత, కూటమి బలం తన గెలుపుకు కలిసి వస్తుందని పవన్ కల్యాణ్ లెక్కలు వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్‌పై మహేష్ బాబు సోదరి మంజుల చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె గతంలో పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. అసలు పవన్ కల్యాణ్‌కు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు.

కానీ ఆయన ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారనిపిస్తోంది. మంచి ఆలోచనతో పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని మంజుల తెలిపారు. నేను ఎప్పుడు పవన్‌తో మాట్లాడలేదని... నాకు ఆయనతో వ్యక్తిగతంగా పరిచియం లేకపోయినా నేను చూస్తుంన్నంత వరకు ఆయనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి మనసు నుంచే వచ్చిందని అనిపిస్తోందని మంజుల చెప్పుకొచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరో కాబట్టి సినిమాలు చేసుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు.
కానీ రాజకీయాల్లో ఉంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని ముందుకెళ్తున్నారు. ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే తపనలో ఆయనలో కనిపిస్తోంది. అలాగే ఆయన ప్రయాణం గెలుపు వైపు అడుగులు వేయాలని కోరుకుంటున్నాను అంటూ మహేష్ బాబు సోదరి మంజుల చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications