34 ఏళ్ల వయస్సులో 34 మందికి తల్లైన మహేష్ బాబు హీరోయిన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ తరం ప్రేక్షకులకు ప్రీతి జింటా క్రేజ్ తెలియక పోవచ్చు , కానీ 1990ల్లో ప్రీతి జింటా అంటే తెలియని అభిమాని ఉండేవారు కాదు. ప్రీతి జింటా బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా నటించింది. ప్రీతి జింటా 1998లో మణిరత్నం దర్శకత్వం వహించిన "దిల్ సే.." చిత్రంతో తన సినీ రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం ఆమె "సోల్జర్" చిత్రంలో కూడా నటించారు. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. "క్యా కెహనా" (2000), "దిల్ చాహ్తా హై" (2001), "కల్ హో నా హో" (2003) (ఈ చిత్రానికి ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు), "వీర్-జారా" (2004), "సలామ్ నమస్తే" (2005) వంటి సూపర్ హిట్ సినిమాలు ప్రీతి జింటా ఖాతాలో ఉన్నాయి.

తెలుగులో మహేష్ బాబు, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. తన అందం, ముఖ్యంగా ఆమె చిరునవ్వుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రీతి జింటా వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె 2016లో అమెరికన్ వ్యాపారవేత్త జీన్ గుడ్‌ఎనఫ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2021లో సరోగసీ ద్వారా కవల పిల్లలు జన్మించారు. వీరికి ఒక బాబు (జై) , ఒక పాప (జియా) ఉన్నారు.ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో లాస్ ఏంజెలెస్‌లో నివసిస్తున్నారు. అయినప్పటికీ ఆమె బాలీవుడ్‌లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ప్రీతి జింటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ జట్టు పంజాబ్ కింగ్స్‌కు సహ-యజమానిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Mahesh Babu s heroine becomes mother to 34 children at the age of 34

ఈక్రమంలోనే హీరోయిన్ ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌ల్లో సందడి చేస్తుంటారు. ప్రీతి జింటా తన జట్టు మ్యాచ్‌లు ఆడుతున్న సమయంలో ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తూ, జట్టును ఉత్సాహపరుస్తూ ఉంటారు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్‌కు చేరినా విన్నర్ కాలేకపోయింది. దీంతో ప్రీతి జింటాకు మరోసారి నిరాశే ఎదురైంది.

ఇదిలా ఉంటే ప్రీతి జింటాలో మరో కోణం కూడా దాగి ఉంది. సామాజిక సేవలోనూ ముందుండి ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం సినిమా నటిగానే కాకుండా, అనాథలకు అమ్మగా మారి తనలోని మరో కోణాన్ని బయటకు తీసింది. 34 ఏళ్ల వయసులో ప్రీతి జింటా తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఆమె జీవితంలో మైలురాయిగా నిలిచింది. రిషికేశ్‌లోని "మదర్ మిరాకిల్ ఆశ్రమం" నుంచి 34 మంది బాలికలను ఆమె దత్తత తీసుకుంది.

దత్తత తీసుకున్న ఈ 34 మంది బాలికలకు తన సొంత కూతుర్లలా చదువు, ఆహారం, బట్టలు, ఆరోగ్య సంరక్షణ వంటి పూర్తి అవసరాలను బాధ్యతగా చూసుకుంటోంది.ప్రీతి జింటా తల్లి కాకముందే ఈ బాలికలను దత్తత తీసుకుంది. తన కవల పిల్లలు జై, జియాకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో, దత్తత పిల్లలకూ అవే సమకూర్చాలని ఆమె నిర్ణయించుకుంది. వారితో రోజూ టచ్‌లో ఉంటూ, వారి చదువు, యోగక్షేమాలు తెలుసుకుంటుంది. సంవత్సరంలో రెండు మూడుసార్లు స్వయంగా వారిని కలుస్తుంటుంది. తనలోని మానవనీయతను ప్రీతి జింటా ఇలా పిల్లలను దత్తత రూపంలో చూపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ప్రీతి జింటాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+