ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సూపర్ స్టార్..? మహేశ్ బాబుకూ మసి పూసేశాడు బాబోయ్..!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా.. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు చర్చల్లో ఉన్నట్లు సమాచారం. దీనిపై ఇరు వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా మహేశ్ బాబు- ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా రావాలని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. మహేశ్ బాబు పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ కు ప్రశాంత్ నీల్ మార్క్ వరల్డ్ బిల్డింగ్, ఎలివేషన్స్ తో మరో పాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్ పక్కా అని తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి వారణాసి సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.
వారణాసి మూవీ మహేశ్ బాబు డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం మహేశ్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం వారణాసి చిత్రం కోసం మహేశ్ బాబుపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ మూవీలో మహేశ్ బాబు సరసన ప్రియాంకా చోప్రా నటిస్తోంది. అలాగే మలయాళం స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వారణాసి చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మాతలు డాక్టర్ కేఎల్ నారాయణ, ఎస్. ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంటర్నేషనల్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి కేవలం గ్రాఫిక్స్ కోసమే 6 నెలలు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు దర్శకుడు ప్రశాంత్ నీల్ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. ఇటీవల సలార్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ దర్శకుడు ఇప్పుడు ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జూన్ 11 న విడుదల కానుంది. ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర చాలా శక్తివంతంగా ఉండనున్నట్లు ఇటీవల రిలీజైన డ్రాగన్ గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. అయితే డ్రాగన్ మూవీ తర్వాత సలార్ 2, కేజీఎఫ్ 3 సినిమాలు ప్రశాంత్ నీల్ చేయాల్సి ఉంది. మరి మహేశ్ బాబుతో సినిమా ఎప్పుడు చేస్తారన్నదానిపై క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే మహేశ్ బాబు వారణాసి చిత్రం తర్వాత సుకుమార్ లేదా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రశాంత్ నీల్ సినిమాలు అన్నీ డార్క్ టోన్ లో ఉంటాయి. ఇటీవల రిలీజ్ అయిన ఎన్టీఆర్ డ్రాగన్ మూవీలోనూ అది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అందగాడు మహేశ్ బాబుకూ మసి పూస్తాడా ఏంటి..? అని ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications