'హరిహర వీరమల్లు' ట్రైలర్ రిలీజ్ కోసం బిగ్ ప్లాన్.. అక్కడే రిలీజ్ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు'. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. పవన్ పొలిటికల్ లైఫ్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. వాయిదా విషయంలో ఇప్పటికే రికార్డు కూడా కొట్టింది ఈ మూవీ. తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై చిత్ర యూనిట్ ఓ అప్డెట్ ఇచ్చింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మూవీ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయిందని ప్రకటించింది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ని ఫినిష్ చేసేశారు. దీంతో మొత్తానికి నిరీక్షణకు తెరపడిందని మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రెండు భాగాలుగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం హరి హర వీరమల్లు పార్ట్ 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు.

ఇక ఈ చిత్రాన్ని జూన్ 12న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. దీంతో మూవీ ప్రమోషన్స్ ను షురూ చేయనుంది చిత్ర యూనిట్. తాజాగా మూవీ ట్రైలర్ అనౌన్స్మెంట్ పై సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ మూవీకి సంబంధించి ఈ నెల 21న చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఆ ప్రెస్ మీట్ లో మూవీ ట్రైలర్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే టాలీవుడ్ లో నడుస్తున్న టాక్ ప్రకారం ట్రైలర్ ను దుబాయిలో ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా పై విడుదల చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుండగా.. మూవీ ట్రైలర్ ను దుబాయ్ లో లాంచ్ చేస్తే మూవీకి మరింత హైప్ వస్తుందని భావిస్తున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. కీలక పాత్రలలో అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, సునీల్, నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త నటిస్తున్నారు. అలానే ఆస్కార్ అవార్డు గ్రహిత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
మరోవైపు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG సినిమాలో కూడా పవన్ పాల్గొంటున్నారు. OG సినిమా షూటింగ్‌ను త్వరగా పూర్తిచేసి దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రం ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందుతున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications