ఉలిక్కిపడ్డ ఫిల్మ్ ఇండస్ట్రీ- అనూహ్య పరిణామం
కేరళలో సంచలనం రేపిన శబరిమల బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును ఎట్టకేలకు ఛేదించారు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు. ఈ కేసులో కింగ్ పిన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలు చోరీకి మూలం ఎక్కడో సిట్ అధికారులు గుర్తించారు. ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేశారు. దీంతో చాలాకాలంగా మింగుడు పడని విధంగా ఈ చోరీ వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్టయింది.
ఆ ప్రధాన సూత్రాధారి మరెవరో కాదు.. ఆలయ ప్రధాన అర్చకుడు కందరారు రాజీవరు. ఆయనను సిట్ అరెస్ట్ చేసింది. ఈ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఆయనను అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పోట్టిని శబరిమలకు తీసుకువచ్చింది ఆయనేనని దర్యాప్తులో తేలింది. ట్రావెన్ కూర్ దేవస్వొం బోర్డు నుంచి జీతం పొందుతున్నందున రాజీవరు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తారని సిట్ గుర్తించింది. ఉన్నికృష్ణన్ చోరీకి పాల్పడిన విషయం రాజీవరుకు ముందే తెలుసునని దర్యాప్తు బృందం వెల్లడించింది.

ఇప్పుడీ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మలయాళ స్టార్ హీరో జయరాం కీలక సాక్షిగా మారారు. ఉన్నికృష్ణన్ పొట్టి నిర్వహించిన పూజలో పాల్గొన్నందున సిట్ ఆయనను ఈ కేసులో చేర్చింది. జయరాం వాంగ్మూలాన్ని నమోదు చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగా ఉంటోన్నందున జయరాం ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటోన్నారు. అక్కడే సిట్ అధికారులు ఆయన స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు.
ఉన్నికృష్ణన్ పొట్టి పూజల ద్వారా జయరాం ఆర్జన, దీనికి సంబంధించిన అంశాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఉన్నికృష్ణన్ పొట్టితో తనకు పరిచయం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన అంగీకరించారు. శబరిమలలో పొట్టితో పరిచయం ఏర్పడిందని, తన ఇంట్లో పూజలు నిర్వహించడానికి వచ్చేవాడని జయరాం తన వాంగ్మూలంలో తెలిపారు. శబరిమల ఆలయంలో బంగారం చోరీ గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు.
కటిళపాళి స్మార్ట్ క్రియేషన్ లో పూజలు, కొట్టాయం ఇళంపల్లి ఆలయం ద్వార బంధనాల ఊరేగింపులోనూ తాను పాల్గొన్నట్లు జయరాం వెల్లడించారు. బంగారు వ్యాపారి గోవర్ధన్‌తో పరిచయం ఉన్నట్లు కూడా ఈ సందర్భంగా జయరాం.. సిట్ అధికారులకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించినంత వరకు సిట్ అధికారులు జయరాంను సాక్షిగా చేర్చనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు- శబరిమల బంగారం చోరీ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి దర్యాప్తు బృందానికి ఇంకా ప్రాసిక్యూషన్ అనుమతి పొందలేదు. అరెస్ట్ అయిన 12 మంది నిందితుల్లో 9 మందిపై చార్జ్‌షీట్ కోసం ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ జాప్యం కారణంగా ఎక్కువ మంది నిందితులు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు. ఎన్ వాసుతో పాటు నలుగురు నిందితులు డిఫాల్ట్ బెయిల్ కు దాఖలు చేసుకున్నట్లు సమాచారం.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications