సన్యాసం స్వీకరించిన మంచు వారి హాట్ హీరోయిన్

Mamta Kulkarni: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా 2025 అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ నెల 13వ తేదీన ఆరంభమైన కుంభమేళాకు దేశం నలుమూలల నుంచీ లక్షలాదిమంది తరలి వెళ్తోన్నారు. గంగా-యమున- సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు.

45 రోజుల పాటు అంటే ఫిబ్రవరి 26వ తేదీ వరకు కొనసాగుతుందీ మహా కుంభ్. ఈ నెల 24వ తేదీ వరకు 9.80 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. దేశ, విదేశాల నుంచి లక్షలాదిమంది ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తోన్నారు.

Mamta Kulkarni starts spiritual journey as the Maha Mandaleshwar of the Kinnar Akhada

మహా కుంభమేళాలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ నటి మమతా కులకర్ణి సన్యాసినిగా మారారు. శుక్రవారం సాయంత్రం సన్యాసాన్ని స్వీకరించారు. కిన్నర్ అఖాడాలో మహా మండలేశ్వర్‌గా మారిపోయారు. తన పేరును సైతం మార్చుకున్నారు. ఇకపై ఆమెను శ్రీయామై మమతా నందిగిరిగా పిలుస్తారు.

గురువారం రాత్రే ఆమె ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. సెక్టార్ 16లో నిర్మించిన ఘాట్ వద్ద పుణ్యస్నానాలను ఆచరించారు. పెద్దలకు పిండ ప్రదానం చేశారు. అనంతరం అక్కడే కిన్నర్ అఖాడా మహా మండలేశ్వర్‌గా సన్యాసాన్ని స్వీకరించారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన అఖాడా ఇది.

90వ దశకంలో మమతా కులకర్ణి ఓ వెలుగు వెలిగారు. 1991లో విడుదలైన నన్‌బంగళ్ ఆమె తొలి సినిమా. 40కి పైగా సినిమాల్లో నటించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, బెంగాలీ భాషల్లో దాదాపుగా స్టార్ హీరోలందరితోనూ నటించారు. తెలుగులో ప్రేమశిఖరం ఆమె తొలి మూవీ. ఆ తరువాత మోహన్ బాబు సరసన దొంగ పోలీస్‌లో నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+