‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా వదులుకున్న హీరో
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత చిరంజీవి కేవలం ఖైదీ నెంబరు 150, వాల్తేరు వీరయ్య సినిమాలతోనే హిట్ అందుకున్నారు. మిగతావన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. సైరా నరసింహారెడ్డి కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత బాలయ్యతో పోల్చుకుంటే బాగా వెనకబడిపోయిన చిరంజీవిని అనిల్ రావిపూడి నిలబెట్టాడు. పోయిన సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో నిర్మాత దిల్ రాజును నిలబెట్టినట్లుగానే, ఈ సంక్రాంతికి చిరంజీవిని నిలబెట్టారు.
కథలో మార్పు చేర్పులు చేసి..
'విశ్వంభర' చిత్రం గ్రాఫిక్స్, విజువల్స్ అన్నీ ఆలస్యం అవుతుండటంతో ఈలోగా సమయాన్ని వృథా చేయకుండా ఓ సినిమా చేయాలని చిరంజీవి భావించారు. వెంటనే అనిల్ రావిపూడిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి సినిమా చేద్దామనగా, అతను వెంటనే ఓకే చెప్పారు. ఎందుకంటే రజనీకాంత్ కోసం అనిల్ ఓ కథను రాసుకున్నారు. ఆయనతో తీయాలని ఎదురుచూస్తున్నారు. అయితే చిరంజీవి సినిమా చేద్దామనగానే అదే కథకు మార్పులు చేశారు. చిరంజీవి ఇమేజ్ కు అనుగుణంగా, ఆయన హావభావాలకు అనుగుణంగా, పాత సినిమాల్లో పాత్రలకు అనుగుణంగా తీర్చిదిద్ది కథను చిరుతో ఓకే చేయించారు. లేదంటే ఈ సినిమా రజనీకాంత్ చేయాల్సింది. విన్న వెంటనే రజనీ ఓకే చెప్పివుంటే ఈ సమయానికి జైలర్ తరహాలో మరో బ్లాక్ బస్టర్ ను రజనీకాంత్ సాధించేవారు.

హీరోలందరికీ అనిల్ మీదే నమ్మకం
చివరకు అది అటు తిరిగి, ఇటు తిరిగి, కథలో మార్పులు, చేర్పులు జరిగి చిరంజీవి దగ్గరకు రావడం, వెంకటేష్ అతిథి పాత్ర పోషించడం, అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ కలిసిరావడంతో ఇంటిల్లపాదీ చూసేలా ఓ సినిమాను తయారు చేశారు. ఇప్పటికే రూ.350 కోట్ల వరకు వసూలు చేసిన ఈ చిత్రం టికెట్లు బుక్ మై షోలో ఇప్పటికీ అమ్ముడుపోతూనే ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా కచ్చితంగా రూ.400 కోట్ల మార్కు అందుకుంటుందని చిరంజీవి అభిమానులు సంతోషంగా ఉన్నారు. ఏదేశమైనప్పటికీ అనిల్ రావిపూడిని నమ్ముకుంటే సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టరే అనే నమ్మకం అగ్ర హీరోలతోపాటు యువ హీరోల్లో కూడా కలిగింది. అనిల్ చేయాల్సింది ఇక నాగార్జునుతోనే.












Click it and Unblock the Notifications